రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణంపైనా కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ది తప్పు లేకపోయినా.. లెక్కకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంపైనా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఓవర్‌లోడ్ ప్యాసింజర్లు ఉన్నా.. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ఉదయం కాలేజీ టైమ్‌లో ఏ టౌన్‌లో చూసినా బస్సుల్లో ప్రయాణికులు లెక్కకు మించే కనిపిస్తారు. పల్లెటూర్ల నుంచి బస్సులు తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తుంది. కాలేజీ విద్యార్థులు, పనుల మీద పట్టణాలకు వచ్చే జనాలతో ఆర్టీసీ బస్సుసు కిక్కిరిసిపోతున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణం.
ఓవర్‌లోడ్ పరిమితి అనేది దైనికైనా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటీ రూల్ ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుకు చాలా మంది వేలాడుతూ వస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారే తప్పా.. పెద్దగా స్పందించరు. మోటార్ వెహికిల్స్ యాక్ట్, 1988 ప్రకారం ప్రతి బస్సుకూ సీటింగ్ కెపాసిటీని రిజిస్ట్రేషన్ సమయంలో తెలియజేస్తారు. కానీ ఈ రూల్ పట్టించుకోవడం అనేది అస్సలు ఉండదు.
ఉదాహరణకు పల్లెవెలుగు బస్సుల్లో 45-48 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది అనుకుంటే.. 10 మంది వరకు నిలబడి ప్రయాణించొచ్చు. కానీ పల్లె వెలుగు బస్సులు వెళ్తుంటే.. చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. బస్సు మెుత్తం ప్యాక్ అయి.. కనీసం కండక్టర్ టికెట్ తీసుకోడానికి వెళ్లేందుకు కూడా అవకాశం ఉండదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బస్సు ఎక్కడ కింద పడిపోతుందా అనే భయం కలుగుతుంది. టర్నింగ్ పాయింట్ల వద్ద ఒక్క వైపునకు ఒరిగిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది.
ఓవర్‌లోడింగ్‌తో బస్సు మీద కూడా ప్రభావం పడుతుంది. మీర్జాగూడ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. RTC బస్సులు తరచుగా భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తాయని, ఓవర్లోడింగ్కు అనుమతిస్తాయని కొందరు చెబుతున్నారు. బస్సులు ప్రభుత్వం నడుపుతున్నందున ఈ ఉల్లంఘనలను పట్టించుకోలేదని అంటున్నారు. ప్రయాణికులు సీటింగ్ సామర్థ్యాన్ని మించకూడదనే నియమం ఉన్నప్పటికీ, అనేక జిల్లా బస్సులు రద్దీగా నడుస్తాయి. రాష్ట్రంలోని చాలా బస్సులు పాత డీజిల్ వాహనాలే. ఈ బస్సుల్లో 70 మంది ప్రయాణికులకంటే ఎక్కువే ఎక్కుతారు. ఇది మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమే.
{{/usCountry}}ఓవర్‌లోడింగ్‌తో బస్సు మీద కూడా ప్రభావం పడుతుంది. మీర్జాగూడ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. RTC బస్సులు తరచుగా భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తాయని, ఓవర్లోడింగ్కు అనుమతిస్తాయని కొందరు చెబుతున్నారు. బస్సులు ప్రభుత్వం నడుపుతున్నందున ఈ ఉల్లంఘనలను పట్టించుకోలేదని అంటున్నారు. ప్రయాణికులు సీటింగ్ సామర్థ్యాన్ని మించకూడదనే నియమం ఉన్నప్పటికీ, అనేక జిల్లా బస్సులు రద్దీగా నడుస్తాయి. రాష్ట్రంలోని చాలా బస్సులు పాత డీజిల్ వాహనాలే. ఈ బస్సుల్లో 70 మంది ప్రయాణికులకంటే ఎక్కువే ఎక్కుతారు. ఇది మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమే.
{{/usCountry}}మరోవైపు బస్సు డ్రైవర్ల టైమింగ్స్ మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దూరప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లకు నిద్ర సరిగా ఉండటం లేదు. రాత్రి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. నైట్ హాల్ట్ సమయంలో డ్రైవర్లకు నిద్ర కరవు అవుతుంది. నైట్ హాల్ట్ చేసే సమయంలో కనీస సదుపాయు లేక చాలా మంది డ్రైవర్లు సరిగా నిద్రపోవడం లేదు. రాత్రి వరకు డ్రైవింగ్ చేసి.. మళ్లీ తెల్లారి లేచి స్టీరింగ్ పట్టకోవాల్సి వస్తుంది. మోటారు వాహనాల చట్టం షిఫ్ట్‌ల మధ్య తొమ్మిది గంటల విశ్రాంతి తప్పనిసరి చేసినప్పటికీ డ్రైవర్లకు సరిగా నిద్ర ఉండటం లేదు.