ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ కూడా నడవలేనంత మంది ప్రయాణికులు.. సీటింగ్ కెపాసిటీ పట్టించుకునేది ఎవరు?

ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినా.. ప్రాణాలు ఉంటాయో.. పోతాయో అనే భయంతోనే చాలా మంది వెళ్తున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ.

Published on: Nov 4, 2025, 13:21:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణంపైనా కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ది తప్పు లేకపోయినా.. లెక్కకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంపైనా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఓవర్‌లోడ్ ప్యాసింజర్లు ఉన్నా.. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఉదయం కాలేజీ టైమ్‌లో ఏ టౌన్‌లో చూసినా బస్సుల్లో ప్రయాణికులు లెక్కకు మించే కనిపిస్తారు. పల్లెటూర్ల నుంచి బస్సులు తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తుంది. కాలేజీ విద్యార్థులు, పనుల మీద పట్టణాలకు వచ్చే జనాలతో ఆర్టీసీ బస్సుసు కిక్కిరిసిపోతున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణం.

ఓవర్‌లోడ్ పరిమితి అనేది దైనికైనా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటీ రూల్ ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుకు చాలా మంది వేలాడుతూ వస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారే తప్పా.. పెద్దగా స్పందించరు. మోటార్ వెహికిల్స్ యాక్ట్, 1988 ప్రకారం ప్రతి బస్సుకూ సీటింగ్ కెపాసిటీని రిజిస్ట్రేషన్ సమయంలో తెలియజేస్తారు. కానీ ఈ రూల్ పట్టించుకోవడం అనేది అస్సలు ఉండదు.

ఉదాహరణకు పల్లెవెలుగు బస్సుల్లో 45-48 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది అనుకుంటే.. 10 మంది వరకు నిలబడి ప్రయాణించొచ్చు. కానీ పల్లె వెలుగు బస్సులు వెళ్తుంటే.. చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. బస్సు మెుత్తం ప్యాక్ అయి.. కనీసం కండక్టర్ టికెట్ తీసుకోడానికి వెళ్లేందుకు కూడా అవకాశం ఉండదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బస్సు ఎక్కడ కింద పడిపోతుందా అనే భయం కలుగుతుంది. టర్నింగ్ పాయింట్ల వద్ద ఒక్క వైపునకు ఒరిగిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది.

ఓవర్‌లోడింగ్‌తో బస్సు మీద కూడా ప్రభావం పడుతుంది. మీర్జాగూడ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. RTC బస్సులు తరచుగా భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తాయని, ఓవర్‌లోడింగ్‌కు అనుమతిస్తాయని కొందరు చెబుతున్నారు. బస్సులు ప్రభుత్వం నడుపుతున్నందున ఈ ఉల్లంఘనలను పట్టించుకోలేదని అంటున్నారు. ప్రయాణికులు సీటింగ్ సామర్థ్యాన్ని మించకూడదనే నియమం ఉన్నప్పటికీ, అనేక జిల్లా బస్సులు రద్దీగా నడుస్తాయి. రాష్ట్రంలోని చాలా బస్సులు పాత డీజిల్ వాహనాలే. ఈ బస్సుల్లో 70 మంది ప్రయాణికులకంటే ఎక్కువే ఎక్కుతారు. ఇది మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమే.

మరోవైపు బస్సు డ్రైవర్ల టైమింగ్స్ మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దూరప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లకు నిద్ర సరిగా ఉండటం లేదు. రాత్రి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. నైట్ హాల్ట్ సమయంలో డ్రైవర్లకు నిద్ర కరవు అవుతుంది. నైట్ హాల్ట్ చేసే సమయంలో కనీస సదుపాయు లేక చాలా మంది డ్రైవర్లు సరిగా నిద్రపోవడం లేదు. రాత్రి వరకు డ్రైవింగ్ చేసి.. మళ్లీ తెల్లారి లేచి స్టీరింగ్ పట్టకోవాల్సి వస్తుంది. మోటారు వాహనాల చట్టం షిఫ్ట్‌ల మధ్య తొమ్మిది గంటల విశ్రాంతి తప్పనిసరి చేసినప్పటికీ డ్రైవర్లకు సరిగా నిద్ర ఉండటం లేదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More