...
...
Next Story

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - లొంగిపోవాలని ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం... శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో సిట్‌ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

Published on: Dec 11, 2025, 16:27:55 IST
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు గట్టి షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం… ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించింది. ఈ సందర్భంగా లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేపు లొంగిపోండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

"రేపు ఉదయం 11.00 గంటలలోపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మరియు దర్యాప్తు అధికారి (సిట్) ముందు లొంగిపోవాలని పిటిషనర్ ను ఆదేశిస్తున్నాం. చట్టానికి అనుగుణంగా కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. పిటిషనర్ తన ఇంటి నుంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవచ్చ "అని ధర్మాసనం తెలిపింది.

విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తెరిచిన ఐక్లౌడ్ ఖాతాలలో ఎటువంటి డేటా లేదని… ఈమెయిల్ చిరునామాలు తెరవలేదని పేర్కొన్నారు. ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్ ఖాతాలను నిలిపివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్‌ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణలో భాగంగా… ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పేరును ఏ1గా చేర్చింది. ఆయన చాలాకాలంగా అమెరికాలో ఉండగా… ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పలు ప్రయత్నాలు చేసి స్వదేశానికి రప్పించింది.

తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు… రేపు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks