Hyderabad News : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సూసైడ్ - అసలేం జరిగింది..?
హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఘోరం జరిగింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్ బలవన్మరణానికి గురైన ఘటన స్థానిక సిబ్బందిని…. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు హాజరైన ఆయన…. నైట్ డ్యూటీలో భాగంగా స్టేషన్‌లోనే ఉన్నారు. బుధవారం ఉదయం చూసేసరికి సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. అది గమనించిన తోటి సిబ్బంది వెంటనే తేరుకుని, సీనియర్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే, సాయికుమార్ ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అనంతర ప్రక్రియ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులు ఆందోళన…
మరోవైపు ఈ ఘటనపై సాయికుమార్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. తన మృతికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉండే అవకాశం ఉందంటూ సాయికుమార్ మొబైల్ ఫోన్‌ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా…. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి ఎలా తరలిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర అసంతృపిని వ్యక్తం చేశారు. అసలు సాయికుమార్ మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల డిమాండ్ల నేపథ్యంలో ఎల్బీనగర్ పోలీసులు అన్ని కోణాల్లో కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
సాయికుమార్ తల్లి మాట్లాడుతూ… పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన కొడుకుని పైఅధికారులే చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. “ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుంది.. మేము రాక ముందే ఆసుపత్రికి పంపించేశారు. మాకు మృతదేహాన్ని కూడా చూపించడం లేదు. మాకు ఒక సీఐ సార్ మీద అనుమానం ఉంది.. ఆయన కనీసం బయటకు రావడం లేదు. తమకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు.
2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్ ని.. ప్రస్తుతం ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కర్మన్‌ఘాట్‌లో ఫ్రెండ్స్ తో కలిసి ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. అతని స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం అర్జున తండగా తెలిసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

