...
...
Next Story

ఖమ్మం వెలుగుమట్లలో నిరాహార దీక్ష భగ్నం - కవిత అరెస్ట్

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ విశారదన్‌ మహారాజ్‌తో కలిసి కవిత సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకుని… అరెస్ట్ చేశారు. కవితను హైదరాబాద్ కు తరలించారు.

Published on: Mar 10, 2026, 11:31:01 IST
Advertisement

ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో కలిసి కవిత సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను ఇవాళ పోలీసులు భగ్నం చేయగా… ఇద్దర్ని అరెస్ట్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవితను హైదరాబాద్ కు తరలించారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్

సోమవారం వెలుగుమట్ల బాధితులను కలిసిన కవిత… వారికి సంఘీభావం తెలిపారు. పేదల ఇళ్లను కూల్చటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ చేసిందని విమర్శించారు. ఇళ్లు కూల్చి పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. కూల్చిన చోటే బాధితులకు కొత్త ఇళ్లు కట్టివ్వాలి న్యాయం జరిగే వరకు బాధితులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

“జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టాం. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వారి సమస్యను మేము చెప్పాం. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నాం. ఈ సమస్య పరిష్కరమయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇస్తున్నాం. అదే విధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి. బాధితులకు ఇళ్లు కట్టించే వరకు మా పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటాం” అని కవిత స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks