ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య..! నిండు గర్భిణిగా ఉన్న కోడలిని నరికి చంపిన మామ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో మామ… గర్భిణీగా ఉన్నకోడలిని నరికి చంపాడు.

Published on: Oct 19, 2025, 10:58:39 IST
By , Kumuram Bheem Asifabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆసిఫాబాద్ జిల్లాలో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. తన కుమారుడిని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మామ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. నిండి గర్భిణీ(9 నెలలు)గా ఉన్న కోడలిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య
ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

ప్రాథమిక వివరాల ప్రకారం…దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి… ఇదే గ్రామానికి చెందిన ఎస్టీ యువతి(20)ని ఏడాది కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి విషయంపై శేఖర్ తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు కొడుకు, కోడలిని ఇంటికి రావొద్దని చెప్పారు. దీంతో శేఖర్ దంపతులు… అత్తగారి ఇంటి వద్దనే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే శనివారం రోజు శేఖర్… అత్త, మామ కుటుంబంతో కలిసి వంట చెరుకు కోసం బయటికి వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో శేఖర్ తండ్రి అయిన సత్తయ్య…. కోడలి ఇంటికి వెళ్లాడు. గొడ్డలితో ఆమెపై దాడికి దిగాడు. నిండు గర్భిణీగా ఉన్న ఆమె… బయటికి పరుగులు తీసినప్పటికీ మామా…బలంగా నరికాడు. దీంతో కోడలు ప్రాణాలు కోల్పోయింది. ఇంతలోనే సత్తయ్య అక్కడ్నుంచి పారిపోయాడు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మామ సత్తయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. హత్య చేసిన సత్తయ్య పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ… విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా… కులాంతర వివాహం విషయంలోనే అభ్యంతరాలు ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More