తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు. ఇలా వరుస ప్రమాదాలు మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ఆపరేటర్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 29 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత బయల్దేరింది. చిట్యాల్ మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను నిద్ర లేపాడు. వారు సకాలంలో బయటకు వచ్చారు. బస్సులో పొగలు వ్యాపించడంతో అనుమానంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను దింపేశారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ బస్సు కూడా నాగాలాండ్‌లో రిజిస్టర్ అయి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాలి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
{{/usCountry}}ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
{{/usCountry}}హైదరాబాద్ - బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు దానిని ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని, బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీకొట్టడం కంటే ముందే ప్రమాదానికి గురయ్యామని అతడి స్నేహితుడు ఎర్రిస్వామి చెప్పాడు. కావేరీ బస్సు ఢీ కొట్టడం కంటే ముందు.. మరో ఓమ్ని బస్సును బైక్‌ను రోడ్డు మధ్యలోకి లాక్కొచ్చింది. దీంతో కావేరీ బస్సు ఢీ కొట్టింది.