...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జులై 31 నుంచి ఆన్‌లైన్‌లోనే అదనపు లగేజ్ బుకింగ్

Railway Luggage Booking Online : భారతీయ రైల్వే జులై 31 నుంచి సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. రైలు టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో అదనపు లగేజీ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Published on: Jul 23, 2026, 10:28:32 IST
Advertisement

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే వేగం, సౌలభ్యం దిశగా మరో తీపి కబురు అందించింది. నిర్ణీత ఉచిత పరిమితికి మించి లగేజ్ (సామాన్లు) తీసుకెళ్లే ప్రయాణికులు ఇకపై పార్సిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్‌లైన్ ద్వారానే అదనపు లగేజ్ బుకింగ్ చేసుకునే కొత్త వెసులుబాటును అందుబాటులోకి తెస్తున్నారు.

రైల్వే లగేజీ ఆన్‌లైన్ బుకింగ్
రైల్వే లగేజీ ఆన్‌లైన్ బుకింగ్

రైల్వే బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో జులై 31 నుంచి ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్‌లోనే ఎక్సెస్ లగేజ్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రయాణికులు తమ రిజర్వుడు కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించదగిన గరిష్ట పరిమితికి లోబడి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

ఏ క్లాస్‌లో ఎంత లగేజ్ ఉచితం?

రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుల క్లాస్‌ను బట్టి ఉచిత లగేజ్ పరిమితి, గరిష్ట పరిమితి వేర్వేరుగా ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్ 70 కేజీల వరకు ఉచితం. అదనపు రుసుము చెల్లించి గరిష్టంగా 150 కేజీల వరకు తీసుకెళ్లవచ్చు. ఫస్ట్ క్లాస్ / ఏసీ 2-టైర్ 50 కేజీల వరకు ఉచితం. గరిష్టంగా 100 కేజీల వరకు అనుమతి. స్లీపర్ క్లాస్ 40 కేజీల వరకు ఉచితం. గరిష్టంగా 80 కేజీల వరకు తీసుకెళ్లవచ్చు.

సెకండ్ క్లాస్ / జనరల్ 35 కేజీల వరకు ఉచితం. గరిష్టంగా 70 కేజీల వరకు అనుమతి. ఏసీ 3-టైర్ అండ్ ఏసీ చైర్ కార్ 40 కేజీల వరకు ఉచితం. అయితే ఈ క్లాసుల్లో ఉచిత పరిమితి, గరిష్ట పరిమితి ఒకటే (40 కేజీలు) కావడం వల్ల, అదనపు లగేజ్ బుకింగ్‌కు అనుమతి ఉండదు.

అదనపు లగేజ్ ఛార్జీలు, జరిమానాలు

కంపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లే లగేజ్ పరిమాణంపై కూడా రైల్వే అధికారులు స్పష్టమైన కొలతలను నిర్దేశించారు. ఏసీ చైర్ కార్ అండ్ ఏసీ 3-టైర్ లగేజ్ సైజు గరిష్టంగా 55 సెం.మీ x 45 సెం.మీ x 22.5 సెం.మీ మించకూడదు. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, స్లీపర్ & జనరల్ క్లాస్: లగేజ్ సైజు గరిష్టంగా 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ వరకు ఉండవచ్చు. నిర్ణీత సైజు కంటే పెద్దవిగా ఉన్న లగేజ్‌ను ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతించరు. వీటిని తప్పనిసరిగా రైలులోని లగేజ్ వ్యాన్/పార్సిల్ వ్యాన్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది.

పార్సిల్ వ్యాన్ లగేజ్ నిబంధనలు

ఒకవేళ గృహోపకరణాలు లేదా భారీ సరుకులను పార్సిల్ వ్యాన్ ద్వారా పంపాలనుకుంటే. ఏసీ / ఫస్ట్ క్లాస్ టికెట్ దారులు 500 కేజీల గృహేతర సరుకులు, 1,000 కేజీల గృహోపకరణాలు బుక్ చేయవచ్చు. నాన్-ఏసీ క్లాస్ టికెట్ దారులు 300 కేజీల గృహేతర సరుకులు, 500 కేజీల గృహోపకరణాలు బుక్ చేసుకోవచ్చు. లగేజ్ ఛార్జీలు ప్రయాణించే దూరం, రైలు రకం, సరుకు బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. కనీస ఛార్జీ రూ.30గా ఉంటుంది. వీటిని కనీసం 50 కిలోమీటర్ల దూరం, 10 కేజీల స్లాబ్‌ల ఆధారంగా లెక్కిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks