Ramappa Temple Somasutram : రామప్పలో అద్భుతం ఆవిష్కృతం - 300 ఏళ్ల తర్వాత 'సోమసూత్రం' పునరుద్ధరణ

Ramappa Temple Somasutram Restoration : యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ (ASI) అరుదైన మైలురాయిని సాధించింది. గర్భగుడిలోని ప్రాచీన 'సోమసూత్రం' పూడికను అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులతో తొలగించి పూర్వవైభవం తీసుకొచ్చింది.

Published on: Sep 7, 2026, 11:21:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramappa Temple Somasutram Restoration : కాకతీయుల శిల్పకళా ప్రతీక, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం గర్భగుడిలోని ప్రాచీన ‘సోమసూత్రం’ను ASI హైదరాబాద్ బృందం విజయవంతంగా పునరుద్ధరించింది.

రామప్ప
రామప్ప

రామప్ప దేవాలయంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత పురావస్తు సర్వేక్షణ (ASI) బృందం…. ఒక అరుదైన, అత్యంత కీలకమైన పునరుద్ధరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. దేవాలయ గర్భగుడిలో శివలింగానికి నిర్వహించే అభిషేక జలాలు వెలుపలికి ప్రవహించే ప్రాచీన మార్గమైన 'సోమసూత్రం' (అభిషేక జలాల మార్గం) శతాబ్దాలుగా మట్టి, ఇతర వ్యర్థాలతో పూడుకుపోయింది.

ఈ సమస్య కారణంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంలో, ఆ జలాలు బయటకు సాఫీగా సాగిపోవడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏఎస్‌ఐ నిపుణులు…. ప్రాచీన కట్టడానికి ఎటువంటి చిన్న ప్రమాదం కూడా వాటిల్లకుండా అత్యంత సాంకేతిక పద్ధతులతో సోమసూత్రాన్ని పునరుద్ధరించారు.

ఆధునిక సాంకేతికతతో….

చారిత్రక నిర్మాణాలకు పునర్జన్మనిచ్చే క్రమంలో ఈ పునరుద్ధరణ ప్రక్రియ ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాతి నిర్మాణాల్లో ఏర్పడిన పూడికను గుర్తించి, తొలగించేందుకు ఏఎస్‌ఐ నిపుణులు 3D మ్యాపింగ్ సాంకేతికతను, ఎండోస్కోపిక్ కెమెరాలను ఉపయోగించారు. కట్టడం లోపలి భాగాన్ని స్పష్టంగా పరిశీలించిన అనంతరం, రాళ్లకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా 'సాఫ్ట్-డ్రిల్లింగ్' వంటి అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులను అమలు చేశారు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు ఏమాత్రం విఘాతం కలగకుండా, సోమసూత్రం మార్గంలో ఉన్న పూడికను, వ్యర్థాలను పూర్తిగా తొలగించారు.

సోమసూత్ర మార్గం పునరుద్ధరణ పూర్తికావడంతో ఇకపై భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగమశాస్త్ర నియమాల ప్రకారం శ్రీరామలింగేశ్వర స్వామికి నిత్య అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దేవునికి సమర్పించిన అభిషేక జలాలు సోమసూత్రం గుండా సజావుగా ప్రవహించి బయటకు వెళ్లే ఏర్పాటు పునరుద్ధరించబడటంతో అర్చకులు, స్థానిక భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునరుద్ధరణ ద్వారా కాకతీయ నిర్మాణ వైభవాన్ని కాపాడటంతో పాటు, ఆలయంలో ధార్మిక విధులను పునరుద్ధరించినట్లయింది.

300 ఏళ్ల తర్వాత… ఈ ప్రాచీన సోమసూత్రం పునరుద్ధరణతో రామప్ప ఆలయంలో మళ్లీ పూర్వపు ధార్మిక వాతావరణం సంతరించుకుంది. ఇకపై భక్తులు, అర్చకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శివలింగానికి నిత్య అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించునే అవకాశం ఏర్పడింది. ఆలయ వర్గాలు తెలిపాయి. కాకతీయ కాలం నాటి శిల్పకళా సంపదను, ఇంజనీరింగ్ అద్భుతాన్ని పునరుద్ధరించినందుకు స్థానిక భక్తులు, చరిత్రకారులు ఏఎస్‌ఐ బృందాన్ని విశేషంగా ప్రశంసిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More