Rapido Ownly Food Delivery : హైదరాబాద్‌లో 'రాపిడో' ఫుడ్‌ డెలివరీ సేవలు షురూ - బెనిఫిట్ ఏంటో తెలుసా..?

Rapido Ownly Food Delivery in Hyderabad : బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో 'ఓన్లీ' (Ownly) ఫుడ్ డెలివరీ యాప్‌ను రాపిడో ప్రారంభించింది. హోటళ్ల నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోని జీరో-కమీషన్ మోడల్‌ను అనుసరిస్తోంది.

Published on: Sep 25, 2026, 21:23:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rapido Ownly Food Delivery Hyderabad : 'రాపిడో' ఫుడ్ డెలివరీ రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బెంగళూరులో విజయవంతంగా నడుస్తున్న తమ ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్ 'ఓన్లీ' (Ownly) సేవలను శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

రాపిడో ఫుడ్‌ డెలివరీ సేవలు
రాపిడో ఫుడ్‌ డెలివరీ సేవలు

కర్ణాటక రాజధాని బెంగళూరు తర్వాత ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన రెండో నగరం హైదరాబాద్ కావడం విశేషం. వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికంలో దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ సందర్భంగా రాపిడో, ఓన్లీ సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంక మాట్లాడుతూ…… "మొదటి రెండు నగరాల్లో వచ్చిన స్పందన ఆధారంగా, వచ్చే త్రైమాసికంలో 'ఓన్లీ' సేవలను అన్ని మెట్రో నగరాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. బెంగళూరు మార్కెట్‌లో మేము పరిచయం చేసిన రెస్టారెంట్-ఫస్ట్, జీరో-కమిషన్ (Zero-Commission) మోడల్‌నే ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రవేశపెడుతున్నాం," అని వెల్లడించారు.

వినియోగదారులకు పొదుపు…

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థలు రెస్టారెంట్ల నుంచి కమీషన్ వసూలు చేయడం, అలాగే వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజులు, ప్యాకేజింగ్ ఛార్జీలు మోపడం పరిపాటిగా మారింది. అయితే 'ఓన్లీ' యాప్ మాత్రం పూర్తి పారదర్శక విధానాన్ని అనుసరిస్తోంది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకపోవడంతో….. హోటళ్లు తమ ఆహార పదార్థాల అసలు ధరలకే యాప్‌లో విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ధరకే ఆహారం లభించడమే కాకుండా, రెస్టారెంట్ యజమానులకు లాభాలు పెరుగుతాయి.

ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో ఓన్లీ యాప్‌ను ప్రారంభించగా…. అక్కడ లభించిన అద్భుతమైన ఆదరణే ఈ విస్తరణకు కారణమని అరవింద్ సంక తెలిపారు. "బెంగళూరులో ఇప్పటికే 25,000 కంటే ఎక్కువ రెస్టారెంట్ పార్టనర్లు మాతో జతకలిసారు. అక్కడ రోజువారీ ఆర్డర్ల సంఖ్య దాదాపు 50,000కు చేరుకుంది. హైదరాబాద్ ప్రజలకు ఆహార సంస్కృతి (Food Culture) పట్ల ఉన్న మక్కువ, అలాగే నగరంలో రాపిడోకు ఉన్న బలమైన నెట్‌వర్క్ మరియు 'కెప్టెన్' (డెలివరీ బాయ్స్) బలగం దృష్ట్యా హైదరాబాద్ మాకు అత్యంత సహజమైన రెండో వేదికగా మారింది," అని ఆయన వివరించారు.

రాపిడో డ్రైవర్ నెట్‌వర్క్‌నే ఈ ఫుడ్ డెలివరీలకు కూడా ఉపయోగిస్తుండటంతో, వారి సేవలు మరింత వేగవంతంగా అందడంతో పాటు కెప్టెన్లకు అదనపు రాబడి మార్గాలు సుగమం కానున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు రాపిడో 'ఓన్లీ' యాప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశ కనిపిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More