తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా మంది అనర్హులు సంక్షేమ పథకాలను పొందుతున్నారని, అర్హులకు అందడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలకు దరఖాస్తు చేయాలంటే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కచ్చితంగా కావాలి.

ఎందుకు అంటే చాలా మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు అందకుండా, అర్హులే ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంది. అందుకే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తు కోసం రేషన్ కార్డును అనుసంధానించాలి. ఇక రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుంది.
ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే మీసేవలో ఆధార్ నెంబర్ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవడం ఒక విధానంగా ఉండేది. దీనికి రేషన్ కార్డు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేది. అయితే మరో విధానంలో రేషన్ కార్డు లేని వారు కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసేవారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపేవారు.
రేషన్ కార్డు లేనివారి దరఖాస్తులు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కోసం భారీగా వస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. విచారణ లేకుండానే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తద్వారా అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.
ఇకపై రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులు లబ్ధి పొందకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందే అనర్హులు ఇకపై ఇబ్బందులు ఎదుర్కొంటారు.
{{/usCountry}}ఇకపై రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులు లబ్ధి పొందకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందే అనర్హులు ఇకపై ఇబ్బందులు ఎదుర్కొంటారు.
{{/usCountry}}మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సంస్కరించడానికి, నిధుల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ మూడు నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించనుంది. కాలేజీల్లో సదుపాయాలు, అర్హులు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారా లేదా అనే అంశాలను రిపోర్ట్ చేస్తారు. ఇటీవల బకాయిలపై బంద్ ప్రకటించి.. తర్వాత కాలేజీలు తెరిచాయి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ కాలేజీలకు ఇటీవలే వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.