రేషన్ కార్డు ఉంటేనే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

Published on: Nov 16, 2025, 17:53:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా మంది అనర్హులు సంక్షేమ పథకాలను పొందుతున్నారని, అర్హులకు అందడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలకు దరఖాస్తు చేయాలంటే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కచ్చితంగా కావాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎందుకు అంటే చాలా మంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు అందకుండా, అర్హులే ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంది. అందుకే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తు కోసం రేషన్ కార్డును అనుసంధానించాలి. ఇక రేషన్ కార్డు ఉంటేనే ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుంది.

ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే మీసేవలో ఆధార్ నెంబర్ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవడం ఒక విధానంగా ఉండేది. దీనికి రేషన్ కార్డు కూడా అనుసంధానంగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేది. అయితే మరో విధానంలో రేషన్ కార్డు లేని వారు కూడా ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం అప్లై చేసేవారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపేవారు.

రేషన్ కార్డు లేనివారి దరఖాస్తులు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కోసం భారీగా వస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. విచారణ లేకుండానే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తద్వారా అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.

ఇకపై రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులు లబ్ధి పొందకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందే అనర్హులు ఇకపై ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సంస్కరించడానికి, నిధుల దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ మూడు నెలల్లో సమగ్ర నివేదికను సమర్పించనుంది. కాలేజీల్లో సదుపాయాలు, అర్హులు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారా లేదా అనే అంశాలను రిపోర్ట్ చేస్తారు. ఇటీవల బకాయిలపై బంద్ ప్రకటించి.. తర్వాత కాలేజీలు తెరిచాయి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ కాలేజీలకు ఇటీవలే వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More