...
...
Next Story

అన్విత గ్రూప్ 10/90 స్కీమ్‌ - మీ సొంతింటి కల ఇక చాలా సులభం..!

అన్విత గ్రూప్‌ 10/90 స్కీమ్‌ ను ప్రకటించింది. దీంతో మీ సొంతింటి కల చాలా సులభమవుతుంది. ఫ్లాట్‌ ధరలో ముందస్తుగా 10 శాతం చెల్లిస్తే చాలు ప్రాసెస్ మొదలవుతుంది.

Published on: Feb 14, 2026, 22:20:22 IST
Advertisement

ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్‌ తాజాగా 10/90 స్కీమ్‌ ప్రకటించింది. ఫ్లాట్‌ ధరలో ముందస్తుగా 10 శాతం చెల్లించి…. ఇల్లు చేతికి వచ్చాకే కస్టమర్‌కు ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని అన్విత గ్రూప్‌ చైర్మన్‌ బొప్పన అచ్యుత రావు , సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా ప్రకటించారు.

అన్విత10 /90 స్కీమ్‌
అన్విత10 /90 స్కీమ్‌

కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా శనివారం స్కీమ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా బొప్పన మీడియాతో మాట్లాడుతూ… ."చాలా మంది కస్టమర్లకు ఇతర లోన్స్‌ ఉంటాయి. దీంతో ఇల్లు చేతికి రాక పూర్వమే గృహ రుణం వాయిదా చెల్లించవలసి రావటం ‌అదనపు భారం అవుతుంది. ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తి చేసి కొనుగోలు దారులకు గృహం అందించే వరకు ఆ భారాన్ని కంపెనీ తీసుకుంటుంది. ఈ సౌలభ్యంతో ఎక్కువ మంది ఇల్లు తీసుకునేందుకు ముందుకు వస్తారు’ అని తెలిపారు.

"కస్టమర్ పెట్టిన ప్రతి రూపాయికీ విలువ చేకూరుతాయి. అంతర్జాతీయ ప్రాజెక్టుల అనుభవం, అందుబాటు ధర, ప్లాటినమ్ రేటింగ్ స్టాండర్డ్స్.. ఈ ప్రత్యేకతలన్నీ అన్విత ప్రతిష్టను పెంచుతున్నాయి" అని నందమూరి బాలకృష్ణ అన్నారు. పలువురు కస్టమర్లకు ఈ సందర్భంగా నందమూరి నూతన గృహాల తాళాలను అందజేశారు.

అన్విత గ్రూప్‌ చైర్మన్‌ బొప్పన అచ్యుత రావు, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ బాలకృష్ణ

భారీ విస్తరణ దిశగా…..

ఈ అయిదు ప్రాజెక్టులకుగాను 11,000 యూనిట్లు కొలువుదీరనున్నాయి. 2029 నాటికి వీటిని కస్టమర్లకు అప్పగించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఫ్లోర్‌ ప్లానింగ్, క్లబ్‌ హౌజ్, ఆంబియెన్స్, అమెనిటీస్‌ వంటి అంశాల్లో వినియోగదార్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని అచ్యుత రావు తెలిపారు.

దేశంలో తొలిసారిగా స్కై వాక్‌..

హైదరాబాద్‌ సమీపంలోని కొల్లూరు వద్ద అన్విత ‘హై–9’ ప్రాజెక్టు నిర్మితం అవుతోంది. 9 టవర్లలో 31 అంతస్తుల్లో 2,200 ఫ్లాట్స్‌ రూపుదిద్దుకో నున్నాయి. దేశంలో తొలిసారిగా అన్ని టవర్లను కలుపుతూ 1.6 కిలోమీటర్ల స్కైవాక్‌ ఏర్పాటు చేయటం అన్విత ప్రత్యేకత.

కొల్లూరు వద్ద మరో ప్రాజెక్టు ‘ఇవానా’ తొలి దశ గడువు కంటే ఏడాది ముందే పూర్తి అయింది. రెండు టవర్లలో 450 యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 1,400 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పోడియం లెవెల్‌లో ఫ్లాట్స్‌ నిర్మాణం చేపట్టకపోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. గ్రీనరీకి పెద్ద పీట వేశారు. 3 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌ కొలువుదీరుతోంది.

మేడ్చల్ వద్ద పార్క్ సైడ్…

ఇక మేడ్చల్‌కు సమీపంలో అన్విత ‘పార్క్‌ సైడ్‌’ ప్రాజెక్ట్‌ 50 ఎకరాల్లో వస్తోంది. 15 క్లస్టర్స్‌గా 270 విల్లాలు ఏర్పాటు అవుతాయి. పార్కుతో ప్రతి విల్లాను అనుసంధానం చేస్తారు.

తెలుగు నేలపై విజయవంతంగా ప్రాజెక్టులను చేపట్టిన అన్విత గ్రూప్‌ విదేశీ గడ్డపైనా జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. యూఎస్‌లోని డల్లాస్ ‌లో 17 ఎకరాల్లో గృహ సముదాయానికి కంపెనీ శ్రీకారం చుట్టింది. అలాగే అక్కడ అంతర్జాతీయ కార్పొరేట్‌ కార్యాలయం ‌ సైతం ఏర్పాటు చేస్తోంది. 500 ఎకరాల విస్తీర్ణంలో 1,700 విల్లాలతో కూడిన భారీ ప్రాజెక్టు సైతం రానుందని అచ్యుత రావు వెల్లడించారు. ఈ ఏడాదే దుబాయిలో రియల్టీ ప్రాజెక్టును లాంచ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

అన్విత గ్రూప్‌నకు ఇప్పటికే 1,800 మంది కస్టమర్లు ఉన్నారు. దుబాయిలో పలు భారీ ప్రాజెక్టుల్లో కంపెనీ పాలుపంచుకుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రత్యక్షంగా 300 మంది ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా 6,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మూడేళ్లలో సిబ్బంది సంఖ్య 1,000కి చేరుతుందని అచ్యుత రావు వెల్లడించారు. ఆ సమయానికి 15,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో అతిపెద్ద రియల్టీ కంపెనీల్లో ఒకటిగా అనతి కాలంలోనే సుస్థిర స్థానం సంపాదిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స్ నాగభూషణం బొప్పన, శ్రీకాంత్, విజయ్ రాజ్ పాల్గొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe