SKLTGHU Recruitment : ఉద్యానవన యూనివర్సిటీలో 79 ఉద్యోగ ఖాళీలు - మంచి జీతం, దరఖాస్తు తేదీలివే
శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 79 ఖాళీలున్నాయి.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తుల గడువు జనవరి 31వ తేదీతో పూర్తవుతుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హార్టికల్చర్ / అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగానుభవం ఉండాలి. నెట్ అర్హత తప్పనిసరి అని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
దరఖాస్తు విధానం ఇలా…
అభ్యర్థులు https://skltghu.ac.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 3 వేలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 2 వేల ఫీజు చెల్లించాలి. కంప్ట్రోలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ పేరు మీద డీడీ తీయాలి.అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జతచేసి…. రిజిస్ట్రార్ కార్యాలయం - 502279 చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 మధ్య జీతం ఉంటుంది. సెల్ఫ్ అసెస్‌మెంట్ స్కోర్ కార్డ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్, బోధానానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫారమ్ తో జత చేయాల్సిన పత్రాలు:
- అభ్యర్థి ఫొటో
- కుల ధ్రువీకరణ పత్రం
- NET Eligibility Certificate
- టెన్త్ మెమో
- ఇంటర్ సర్టిఫికెట్
- డిగ్రీ ప్రొవిజన్ మెమో
- మాస్టర్స్ డిగ్రీ మెమో
- పీహెచ్డీ పట్టా
- పని చేసిన అనుభవానికి సంబంధించిన పత్రాలు
- ఇతర పత్రాలు
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

