నాంపల్లి అగ్నిప్రమాదం : కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ - 5 మృతదేహాలు గుర్తింపు

నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.   భవనం లోపల చిక్కిపోయిన 5 మృతదేహాలను గుర్తించారు.  దట్టమైన పొగ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

Published on: Jan 25, 2026, 09:22:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఘటన జరగగా… అప్పట్నుంచి నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్ లో నిమగ్నమయ్యాయి.

నాంపల్లి అగ్నిప్రమాద ఘటన
నాంపల్లి అగ్నిప్రమాద ఘటన

రెస్క్యూ ఆపరేషన్ కు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. ఎట్టకేలకు ఇవాళ భవనంలో చిక్కిపోయిన వారిలోని ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. వెంటనే మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంకా ఎవరైనా చిక్కిపోయారా అనే దానిపై సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

ఈ ఘటనలో బేబీ (45),అఖిల్ (11),ప్రణీత్ (8), ఇంతియాజ్(28), హబిబ్(32)లను మృతులుగా గుర్తించారు. దాదాపు 22 గంటలకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ ప్రమాదానికి సంబధించి అధికారులు పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలను పాటించనందుకు దుకాణ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More