RGUKT IIIT Admissions 2026 : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

Telangana IIIT Admissions2026 : బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీల్లో పీయూసీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించారు. అర్హులైన టెన్త్ విద్యార్థులు… ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 

Published on: May 11, 2026, 06:34:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana IIIT Admissions2026 : తెలంగాణలోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం కాగా… మే 10వ తేదీతో ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు… ఈ తేదీని మే 14వ తేదీని పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ (VC) ప్రొఫెసర్ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు
బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

గడువు పొడిగించిన నేపథ్యంలో… అర్హులైన విద్యార్తులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి వరకు వేచి చూడకుండా త్వరితగతిన అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) ప్రాసెస్ మే 20తో ముగుస్తుంది.

ఎంపికైన వారి జాబితాను మే 30వ తేదీన ప్రకటిస్తారు. జూన్ 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించిన టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు - అప్లికేషన్ ప్రాసెస్

  1. ముందుగా https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని యూజీ అడ్మిషన్స్ - 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ నొక్కాలి. ఇక్కడ బోర్డు, హాల్ టికెట్ , మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. ఆ తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఇక ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1,500గా నిర్ణయించారు.
  5. విద్యార్థి వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాలి.
  6. చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

రాష్ట్రంలోని ఐఐఐటీ క్యాంపస్ ల్లో ప్రవేశాల కోసం పదో తరగతి రెగ్యూలర్ విద్యార్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు. బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోనూ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. వయోపరిమితి 01.06.2026 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More