RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఫేజ్ - 2 మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసింది. ఇందులో మిగిలిపోయిన సీట్లతో పాటు, పెరిగిన సీట్ల భర్తీ కోసం ఈ విడత ఎంపిక జాబితాను రూపొందించారు. ఈ ప్రొవిజనల్ ఎంపికలో చోటు దక్కించుకున్న విద్యార్థులు రెండు క్యాంపస్‌లలో దేనికి ఎంపికయ్యారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఫేజ్-2 లో సీటు సాధించిన విద్యార్థులు నిర్దేశిత గడువు లోపు ఆయా క్యాంపస్‌లలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, ఫీజు వివరాలు మరియు అవసరమైన పత్రాల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమంతప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు. గడువులోగా రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లను ఆటోమేటిక్‌గా రద్దు చేసి తదుపరి విడతలో భర్తీ చేస్తారు.
ట్రిపుల్ ఐటీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
బాసర ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంపిక జాబితాను కింది విధానం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు…
- మొదటగా ఆర్‌జీయూకేటీ (RGUKT) అధికారిక అడ్మిషన్ల వెబ్‌సైట్ పేజీ అయిన https://www.rgukt.ac.in/admissions2026.html ను సందర్శించాలి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న ‘Provisional Selection Results for Phase-II’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులోని సెలెక్షన్ స్టేటస్ లింక్ పై నొక్కాలి.
- విద్యార్థి అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
రెండో విడత కింద ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం , రేషన్ కార్డ్ తదితర పత్రాలతో పాటు నిర్ణీత ఫీజుతో క్యాంపస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి బాసర ఐఐఐటీ ప్రవేశాల రిజల్ట్ నేరుగా చేసుకోవచ్చు
{{/usCountry}}రెండో విడత కింద ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం , రేషన్ కార్డ్ తదితర పత్రాలతో పాటు నిర్ణీత ఫీజుతో క్యాంపస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.