RGUKT IIIT Results 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశాలు - సెకండ్ ఫేజ్ ఫలితాలు విడుదల, రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి
RGUKT Phase 2 selection list : బాసర ఐఐఐటీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఎంపికైన వారికి బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
RGUKT Basar Selection List 2026 :రాష్ట్రంలోని సాంకేతిక విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఫేజ్ - 2 మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాను అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (B.Tech) కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇప్పటికే మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసింది. ఇందులో మిగిలిపోయిన సీట్లతో పాటు, పెరిగిన సీట్ల భర్తీ కోసం ఈ విడత ఎంపిక జాబితాను రూపొందించారు. ఈ ప్రొవిజనల్ ఎంపికలో చోటు దక్కించుకున్న విద్యార్థులు రెండు క్యాంపస్‌లలో దేనికి ఎంపికయ్యారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఫేజ్-2 లో సీటు సాధించిన విద్యార్థులు నిర్దేశిత గడువు లోపు ఆయా క్యాంపస్‌లలో ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్, ఫీజు వివరాలు మరియు అవసరమైన పత్రాల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమంతప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు. గడువులోగా రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీట్లను ఆటోమేటిక్‌గా రద్దు చేసి తదుపరి విడతలో భర్తీ చేస్తారు.
ట్రిపుల్ ఐటీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
బాసర ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంపిక జాబితాను కింది విధానం ద్వారా తనిఖీ చేసుకోవచ్చు…
- మొదటగా ఆర్‌జీయూకేటీ (RGUKT) అధికారిక అడ్మిషన్ల వెబ్‌సైట్ పేజీ అయిన https://www.rgukt.ac.in/admissions2026.html ను సందర్శించాలి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న ‘Provisional Selection Results for Phase-II’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మరో విండో ఓపెన్ అవుతుంది. ఇందులోని సెలెక్షన్ స్టేటస్ లింక్ పై నొక్కాలి.
- విద్యార్థి అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
రెండో విడత కింద ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో, టీసీ, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం , ఆదాయ ధృవీకరణ పత్రం , రేషన్ కార్డ్ తదితర పత్రాలతో పాటు నిర్ణీత ఫీజుతో క్యాంపస్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

