...
...
Next Story

RGUKT IIIT Counselling 2026 : బాసర ఐఐఐటీ ప్రవేశాలు - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..! పూర్తి సమాచారం

RGUKT Basara Counselling 2026 : రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ (RGUKT) బాసర క్యాంపస్‌లో 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జూన్ 5 నుంచి హాజరుకావాలి.

Published on: Jun 4, 2026, 17:20:30 IST
Advertisement

RGUKT Basara Counselling 2026 : రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT Basar) లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశానికి తాత్కాలికంగా ఎంపికైన (Provisionally Selected) అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది.

బాసర ఐఐఐటీ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
బాసర ఐఐఐటీ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

అర్హులైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరుకావాలని వర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల సీరియల్ నంబర్ల(ర్యాంకులు) ఆధారంగా కౌన్సెలింగ్ తేదీలను విభజించారు.

బాసర ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ 2026 : తేదీలు

  • మొదటి రోజు (05-06-2026 ): ప్రవేశాల జాబితాలో సీరియల్ నంబర్ 1 నుంచి 564 వరకు స్థానం సంపాదించుకున్న అభ్యర్థులు జూన్ 5వ తేదీన కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
  • రెండో రోజు (06-06-2026) : సీరియల్ నంబర్ 565 నుండి 1128 వరకు ఉన్న అభ్యర్థులకు జూన్ 6వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
  • మూడో రోజు (08-06-2026 ): చివరి రోజున అంటే జూన్ 8వ తేదీన సీరియల్ నంబర్ 1129 నుంచి 1691 వరకు ఉన్న మిగిలిన విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. జూన్ 7వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు కౌన్సెలింగ్ ఉండదు.

మొదటి విడత కింద సీటు దక్కించుకున్న విద్యార్థులకు బాసర క్యాంపస్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ (కౌన్సెలింగ్) నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా అధికారులు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అభ్యర్థులు తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం నిర్ణీత రోజున మాత్రమే క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించిన టెన్త్ మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అధికారులు కేటాయించిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు తమ సీటును కోల్పోతారు. ఆ ఖాళీలను తదుపరి విడత (Second Phase) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోని ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. https://www.rgukt.ac.in/admissions2026.html లింక్ పై క్లిక్ చేసి ఎంపికైన వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks