TG SSC Supplementary Hall Ticket : టెన్త్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్, పరీక్షల షెడ్యూల్ వివరాలు
TG SSC Supplementary Hall Tickets 2026 : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
TG SSC Supplementary Hall Tickets 2026 : తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ నెలలో జరగబోయే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారు ఈ పరీక్షలు రాయవచ్చు.

టెన్త్ విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in లోకి లాగిన్ అయి, తమ జిల్లా, పాఠశాల పేరు, పుట్టిన తేదీ మరియు విద్యార్థి పేరు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు.
స్కూల్ లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు (HM) కూడా తమ పాఠశాల విద్యార్థుల హాల్ టికెట్లను బల్క్‌గా డౌన్‌లోడ్ చేసి, సంతకం, సీలు వేసి విద్యార్థులకు అందజేస్తారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే… పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు సంబంధిత పాఠశాల హెచ్ఎంతో ధృవీకరించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఈ సప్లిమెంటరీ పరీక్షలను ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా…. పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి కనీస వసతులను కల్పిస్తున్నారు. విద్యార్థులు హాల్ టికెట్ పైన ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదువుకుని, పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
టీజీ టెన్త్ 2026 సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ :
- జూన్ 5 (శుక్రవారం)వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ), కాంపోజిట్ కోర్సు పరీక్ష
- జూన్ 6 (శనివారం)వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
- జూన్ 7 (ఆదివారం)వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్ష
- జూన్ 8 (సోమవారం)వ తేదీన మ్యాథమెటిక్స్ పరీక్ష
- జూన్ 9 (మంగళవారం)వ తేదీన సైన్స్ పార్ట్ 1 (ఫిజికల్ సైన్స్) పరీక్ష
- జూన్ 10 (బుధవారం)వ తేదీన సైన్స్ పార్ట్ 2 (బయోలాజికల్ సైన్స్) పరీక్ష
- జూన్ 11 (గురువారం)వ తేదీన సోషల్ స్టడీస్, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ పేపర్ 1 పరీక్ష
- జూన్ 12 (శుక్రవారం)వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

