తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బొల్లా దీక్షిత్ (21), కొక్కల సాయి (20)గా గుర్తించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మోత్కూరు నుండి వలిగొండ వైపు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో రోడ్డు ప్రమాదాలు
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోంపేట మండలం బారువ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. లారీ, కారు డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన ఇద్దరు.. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి.. మరణించారు. మృతులు ఒడిశా వాసులుగా తెలుస్తోంది.
విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. పద్మనాభం ఆలయాన్ని సందర్శించి కుటుంబం తిరిగి వస్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్లను ఢీకొట్టి దాదాపు 20 మీటర్ల దూరంలో పడింది.
{{/usCountry}}విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. పద్మనాభం ఆలయాన్ని సందర్శించి కుటుంబం తిరిగి వస్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్లను ఢీకొట్టి దాదాపు 20 మీటర్ల దూరంలో పడింది.
{{/usCountry}}మృతుడిని గంటి వీవీఎస్ ప్రసాద్ గా గుర్తించామని పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద కారు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు.