కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రిషద్ కాలికి తూటా గాయమైంది. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు కాల్పులు జరిపినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయాన్నే ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.బాధితుడు రిషద్‌ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజీ …
మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. ముందుగా రిషద్ ను బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం జరిగినట్లు ఇందులో ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో క్యాష్ తీసుకుని గన్‌తో కాలిపై కాల్పులు జరిపారు.