శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఇక స్పాట్ బుకింగ్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. అనుకున్నదానికంటే ఎక్కువ మంది వీటి ద్వారా వెళ్తుండటంతో రద్దీ నెలకొంటోంది.

అయితే తాజాగా శబరిమల యాత్రపై అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. నేటి నుంచి సోమవారం వరకు స్పాట్ బుకింగ్‌లను 5,000కి తగ్గించారు. గతంలో ఈ పరిమితి 20,000 వరకు ఉంది. అటవీ మార్గంలో నడిచి వచ్చే స్వాములకు ప్రత్యేక పాసులు ఇస్తారు. యాత్రికులు అటవీ శాఖ నుండి పాస్‌లు పొందాలని నివేదికలు చెబుతున్నాయి.
కానీ అడవి మార్గంలోనూ వచ్చే భక్తులకు సైతం పాసుల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటు నుంచి వచ్చేవారికి కూడా 5 వేల పాసులకు పరిమితం చేయాలనే విషయంపై చర్చ నడుస్తోంది. నిర్వహణ చర్యలలో భాగంగా రోజువారీ దర్శన పరిమితిని 75,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ కోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తూ.. యాత్రికుల కదలికను క్రమబద్ధీకరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.
యాత్రికుల రద్దీని నియంత్రించే ప్రయత్నంలో అధికారులు రోజుకు 20,000 మందికి స్పాట్ బుకింగ్‌ను పరిమితం చేశారు. కానీ ఆ సమయంలో 30,000 మందికి పైగా యాత్రికులు స్పాట్ బుకింగ్ ద్వారా వస్తున్నట్టు తెలిసింది. దీని వలన రద్దీ నియంత్రణ మరింత కష్టమైంది. పరిమితి చేరుకున్న తర్వాత వచ్చిన వారికి మరుసటి రోజు దర్శనానికి అనుమతి అధికారులు తెలిపారు. తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా 5 వేలకు స్పాట్ బుకింగ్స్ పరిమితం చేయాల్సి వచ్చింది.
రద్దీని తగ్గించడానికి బుకింగ్‌ల కోసం నీలక్కల్ వద్ద ఏడు అదనపు బుకింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంప వద్ద ఒకటి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పాస్‌లను 10 వేలకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. సన్నిధానం వద్ద క్యూ క్లియర్ అయిన తర్వాత మాత్రమే యాత్రికులను ప్రవేశించడానికి అనుమతించారు.
{{/usCountry}}రద్దీని తగ్గించడానికి బుకింగ్‌ల కోసం నీలక్కల్ వద్ద ఏడు అదనపు బుకింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంప వద్ద ఒకటి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పాస్‌లను 10 వేలకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. సన్నిధానం వద్ద క్యూ క్లియర్ అయిన తర్వాత మాత్రమే యాత్రికులను ప్రవేశించడానికి అనుమతించారు.
{{/usCountry}}ప్రస్తుతం సన్నిధానం వద్ద సాధారణ రద్దీ కొనసాగుతోంది. వర్చువల్ క్యూ ద్వారా వచ్చే అయ్యప్ప భక్తులందరికీ సజావుగా దర్శనం కల్పిస్తామని పోలీసులు తెలిపారు. బుకింగ్ తర్వాత వచ్చే భక్తులు దర్శనం చేసుకోలేకపోతే, వారు ఈ విషయం గురించి పోలీసులకు తెలియజేయవచ్చు, పరిష్కారం దొరుకుతుంది.