నేటి నుంచి శబరిమల స్పాట్ బుకింగ్‌లు 5 వేలే.. అడవి నడకమర్గంలో వచ్చేవారికి ప్రత్యేక పాసులు!

శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో స్పాట్ బుకింగ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published on: Nov 20, 2025, 08:48:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించారు. ఇక స్పాట్ బుకింగ్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. అనుకున్నదానికంటే ఎక్కువ మంది వీటి ద్వారా వెళ్తుండటంతో రద్దీ నెలకొంటోంది.

శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం

అయితే తాజాగా శబరిమల యాత్రపై అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. నేటి నుంచి సోమవారం వరకు స్పాట్ బుకింగ్‌లను 5,000కి తగ్గించారు. గతంలో ఈ పరిమితి 20,000 వరకు ఉంది. అటవీ మార్గంలో నడిచి వచ్చే స్వాములకు ప్రత్యేక పాసులు ఇస్తారు. యాత్రికులు అటవీ శాఖ నుండి పాస్‌లు పొందాలని నివేదికలు చెబుతున్నాయి.

కానీ అడవి మార్గంలోనూ వచ్చే భక్తులకు సైతం పాసుల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటు నుంచి వచ్చేవారికి కూడా 5 వేల పాసులకు పరిమితం చేయాలనే విషయంపై చర్చ నడుస్తోంది. నిర్వహణ చర్యలలో భాగంగా రోజువారీ దర్శన పరిమితిని 75,000 మంది భక్తులకు పరిమితం చేశారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ కోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తూ.. యాత్రికుల కదలికను క్రమబద్ధీకరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.

యాత్రికుల రద్దీని నియంత్రించే ప్రయత్నంలో అధికారులు రోజుకు 20,000 మందికి స్పాట్ బుకింగ్‌ను పరిమితం చేశారు. కానీ ఆ సమయంలో 30,000 మందికి పైగా యాత్రికులు స్పాట్ బుకింగ్ ద్వారా వస్తున్నట్టు తెలిసింది. దీని వలన రద్దీ నియంత్రణ మరింత కష్టమైంది. పరిమితి చేరుకున్న తర్వాత వచ్చిన వారికి మరుసటి రోజు దర్శనానికి అనుమతి అధికారులు తెలిపారు. తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా 5 వేలకు స్పాట్ బుకింగ్స్ పరిమితం చేయాల్సి వచ్చింది.

రద్దీని తగ్గించడానికి బుకింగ్‌ల కోసం నీలక్కల్ వద్ద ఏడు అదనపు బుకింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంప వద్ద ఒకటి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పాస్‌లను 10 వేలకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. సన్నిధానం వద్ద క్యూ క్లియర్ అయిన తర్వాత మాత్రమే యాత్రికులను ప్రవేశించడానికి అనుమతించారు.

ప్రస్తుతం సన్నిధానం వద్ద సాధారణ రద్దీ కొనసాగుతోంది. వర్చువల్ క్యూ ద్వారా వచ్చే అయ్యప్ప భక్తులందరికీ సజావుగా దర్శనం కల్పిస్తామని పోలీసులు తెలిపారు. బుకింగ్ తర్వాత వచ్చే భక్తులు దర్శనం చేసుకోలేకపోతే, వారు ఈ విషయం గురించి పోలీసులకు తెలియజేయవచ్చు, పరిష్కారం దొరుకుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More