TG Court Recruitment 2026 : తెలంగాణ కోర్టు ఉద్యోగాల అప్డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
Telangana Court Jobs 2026 : తెలంగాణ జుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసుల్లోని ఉద్యోగాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల షెడ్యూల్‌ను హైకోర్టు ప్రకటించింది.
Telangana Court Recruitment 2026 : తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు కీలక అప్‌డేట్ ఇచ్చింది. జుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల (CBT) సమగ్ర షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన), రిక్రూట్‌మెంట్ విభాగం ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు.

ఈ ఏడాది జనవరి 19న విడుదల చేసిన నోటిఫికేషన్లలో భాగంగా…. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 24వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది.
పరీక్షల పూర్తి వివరాలు, షెడ్యూల్ ఇలా ఉంది:
- ఎగ్జామినర్: ఈ పోస్టుకు జూన్ 24న మొదటి షిఫ్ట్‌లో పరీక్ష జరుగుతుంది.
- ఫీల్డ్ అసిస్టెంట్: ఈ పోస్టుకు జూన్ 24న రెండు, మూడు షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 2, షిఫ్ట్ 3) పరీక్షలు నిర్వహిస్తారు.
- జూనియర్ అసిస్టెంట్: ఈ పోస్టుకు జూన్ 25న మూడు షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3) పరీక్షలు జరుగుతాయి.
- రికార్డ్ అసిస్టెంట్: ఈ పోస్టుకు జూన్ 28న రెండు షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 1, షిఫ్ట్ 2) పరీక్షలు నిర్వహిస్తారు.
హాల్‌టికెట్ల డౌన్లోడ్ వివరాలు…
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు జూన్ 17వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, వాటిపై సూచించిన పరీక్షా కేంద్రాలకు నిర్దేశిత సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టికెట్ల కోసం తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ www.tshc.gov.in ను సందర్శించవచ్చు.
ఈ నియామక పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వీలుగా హైకోర్టు హెల్ప్ డెస్క్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం 040-23688394 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

