ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కరీంనగర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, సర్వీసుల వివరాలివే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరీంనగర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కరీంనగర్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో నేరుగా కరీంనగర్ నుంచి తిరుమలకు వెళ్లి రావొచ్చు. మొత్తం 8 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్తాయి. మరో నాలుగు తిరుపతి నుంచి కరీంనగర్ కి రాకపోకలు సాగిస్తున్నాయి.

మొత్తం 8 ట్రిప్స్…
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం….తిరుపతి - కరీంనగర్ (ట్రైన్ నెంబర్ 02761) మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 6వ తేదీ నుంచి జూలై 27 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. కేవలం ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ట్రైన్స్ నడుస్తాయి.
ఇక కరీంనగర్ - తిరుపతి (ట్రైన్ నెంబర్ 02762) మధ్య మరో నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి. జూలై 7 నుంచి జూలై 28 తేదీల మధ్య రాకపోకలు ఉంటాయి. అది కూడా సోమవారం రోజుల్లో మాత్రమే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రానుపోనూ అన్ని కలిపి మొత్తం 8 ట్రిప్స్ ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఈ స్పెషల్ రైళ్లు ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతినుంచి బయలుదేరుతాయి. సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకుంటాయి. ఇక సోమవారం సాయంత్రం 5:30 కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8:25 కి తిరుపతి చేరుకుంటుంది.
ట్రైన్స్ ఆగే స్టేషన్లు ఇవే:
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధురై, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్. వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్లు ఆగుతాయి. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


