సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్ ఉద్యోగాలు - కేవలం ఇంటర్వూనే…!

ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.టర్మ్‌ బేసిస్‌ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. https://apsrkpuram.edu.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

Published on: Jan 14, 2026, 13:22:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సికింద్రాబాద్‌, ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా టర్మ్ బేసిస్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందుకు ఫిబ్రవరి 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

సికింద్రాబాద్ ఆర్మీలో టీచింగ్ ఖాళీలు
సికింద్రాబాద్ ఆర్మీలో టీచింగ్ ఖాళీలు

ఆర్మీ స్కూల్ లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు

  • ఉద్యోగ ప్రకటన - ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కేపురం, సికింద్రాబాద్
  • ఉద్యోగ ఖాళీలు - టీచింగ్ పోస్టులు
  • 4 అకాడమిక్‌ సంవత్సరాల పాటు టర్మ్‌ బేసిస్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులున్నాయి.
  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా ప్రైమరీ టీచర్ ఖాళీలు 20 ఉన్నాయి.టీజీటీ ఖాళీలు 18, ప్రీ-ప్రైమరీ టీచర్ 6 ఖాళీలున్నాయి.
  • పోస్టును బట్టి విద్యా అర్హతలుంటాయి. టీచింగ్ పోస్టులకు బీఈడీతో పాటు టెట్ లేదా సీటెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో బోధనా నైపుణ్యాలు ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • “ARMY PUBLIC SCHOOL RK PURAM” పేరు మీద రూ. 250 డీడీ చెల్లించాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను “ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆర్‌కే పురం, సికింద్రాబాద్‌ - 500056” చిరునామాకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 3 ఫిబ్రవరి 2026
  • దరఖాస్తుల షార్ట్ లిస్ట్ తర్వాత ఫిబ్రవరి నెలలోనే ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://apsrkpuram.edu.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More