ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 13 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరి కింద 8 ఖాళీలను చూపారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్‌బీ, పీజీ, ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం…
ఈ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ లోని గూగుల్ ఫామ్ ను పూర్తి చేయాలి. https://aiimsbibinagar.edu.in/ వెబ్ సైట్ లో ఈ ఫామ్ ఉంటుంది. మీ విద్యా అర్హతలతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి. ఏమైనా సమస్యలు వస్తే jr.aiimsbibinagar@gmail.com కు మెయిల్ చేయవచ్చు. మీ దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఎంబీబీఎస్ డిగ్రీ, ఇంటర్న్ షిప్, యూజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంసీఐ రిజిస్ట్రేషన్, కుల ధ్రువీకరణపత్రంతో పాటు ఇతర పత్రాలను (జిరాక్స్) తీసుకెళ్లాలి. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 జీతం ఇస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,770 చెల్లించాలి. AIIMS BIBINAGAR పేరు మీద డీడీ తీయాలి. ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల లోపు పంపిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు