...
...
Next Story

తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత - మరింతగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు...!

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిర్పూర్ లో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published on: Nov 16, 2025, 13:14:59 IST
Advertisement

రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పలు జిల్లాలో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనాలు చలి తీవ్రతకు వణికిపోతున్నారు.

పెరుగుతున్న చలి తీవ్రత
పెరుగుతున్న చలి తీవ్రత

రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే 3 నుంచి నాలుగు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగానూ పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

తెలంగాణ వెదర్ మ్యాన్ వివరాల ప్రకారం… ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో రికార్డు స్థాయిలో 7.4 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ లో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డుయ్యాయి. ఇక హైదరాబాద్ లోని హెచ్ సీయూ వద్ద 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళలో మరింత స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. ప్రజలు చలి మంటలు కాస్తున్నారు.డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో చలి ఎంత తీవ్రంగా ఎక్కవగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks