Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Published on: Mar 06, 2026 9:16 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తుండగా… ఆయన్ను తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌ గా ఉన్న జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా
తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా

కొత్త గవర్నర్ శివపత్రాప్ శుక్లా నేపథ్యం…

  • కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్‌ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా రుద్రాపుర్‌ గ్రామంలో జన్మించారు.
  • రుద్రాపుర్‌లో ప్రాథమిక విద్య, గోరఖ్‌పుర్‌లో కాలేజీ విద్య పూర్తిచేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
  • చదువుకునే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు.
  • 1983లో శివపత్రాప్ శుక్లా భారతీయ జనతా పార్టీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్‌పుర్‌ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 1991లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు.
  • 1993, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు 1996లో కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌ల ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేశారు. 2
  • 2016లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.
  • 2017లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 2023 ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More