సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీకి సర్క్యులర్ విడుదల అయింది.

ఈ2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23 ఉన్నాయి. వీరికి బేసిక్ శాలరీ నెలకు రూ.50000గా నిర్ణయించారు. అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్ 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
పైన చెప్పిన పోస్టులకు ఇంటర్నల్ అభ్యర్థులు.. ఆన్‌లైన్ అప్లికేషన్ 10/11/2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసుకోవచ్చు. చివరి తేదీ 24/11/2025గా నిర్ణయించారు. అయితే అప్లికేషన్ హార్డ్ కాపీలను కూడా యూనిట్ లెవెల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నవంబర్ 26వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. జీఎం ఆఫీసుకు అప్లికేషన్ హార్డ్ కాపీతోపాటుగా అసెస్‌మెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పజెప్పాలి. ఇక అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీసులో ఇవ్వాల్సిన తేదీని నవంబర్ 30గా నిర్ణయించారు.
గనులు/విభాగాల అధిపతులు అప్లికేషన్లను సరిగా పరిశీలించాలని నోటిఫికేషన్‌లో ఆదేశించారు. సర్వీసుకు సంబంధించిన వివరాలు, విద్యార్హత, అనుభవంలాంటి వివరాలను సరిగా చూడాలని చెప్పారు. అభ్యర్థుల అసెస్‌మెంట్ రిపోర్ట్‌ను అన్ని విభాగాల అధిపతులు సీల్డ్ కవర్‌లో అప్లికేషన్‌త జతచేసి పంపాలని తెలిపారు.
ఇంటర్నల్ అభ్యర్థులకు వయసు పరిమితి లేదని నోటిఫికేషన్‌లో తెలిపారు. చివరి తేదీ దాటిన తర్వాత అప్లికేషన్ వస్తే రిజెక్ట్ అవుతుందని వెల్లడించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సంబంధిత పత్రాలు జత చేసి వెంటనే సబ్మిట్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు తర్వాత రాత పరీక్షకు హాజరుకావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
{{/usCountry}}ఇంటర్నల్ అభ్యర్థులకు వయసు పరిమితి లేదని నోటిఫికేషన్‌లో తెలిపారు. చివరి తేదీ దాటిన తర్వాత అప్లికేషన్ వస్తే రిజెక్ట్ అవుతుందని వెల్లడించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సంబంధిత పత్రాలు జత చేసి వెంటనే సబ్మిట్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు తర్వాత రాత పరీక్షకు హాజరుకావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
{{/usCountry}}అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గనులు, అన్ని విభాగాల అధిపతులు విస్తృత ప్రచారం కల్పించాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు http://www.scclmines.com/internal వెబ్‌సైట్ సందర్శించాలి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.