సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇదిగో!
సింగరేణిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తులు చేసుకోవాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది.
సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాలరీస్ నుంచి ఈ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీకి సర్క్యులర్ విడుదల అయింది.

ఈ2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23 ఉన్నాయి. వీరికి బేసిక్ శాలరీ నెలకు రూ.50000గా నిర్ణయించారు. అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్ 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
పైన చెప్పిన పోస్టులకు ఇంటర్నల్ అభ్యర్థులు.. ఆన్‌లైన్ అప్లికేషన్ 10/11/2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసుకోవచ్చు. చివరి తేదీ 24/11/2025గా నిర్ణయించారు. అయితే అప్లికేషన్ హార్డ్ కాపీలను కూడా యూనిట్ లెవెల్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నవంబర్ 26వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. జీఎం ఆఫీసుకు అప్లికేషన్ హార్డ్ కాపీతోపాటుగా అసెస్‌మెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పజెప్పాలి. ఇక అప్లికేషన్ కార్పొరేట్ ఆఫీసులో ఇవ్వాల్సిన తేదీని నవంబర్ 30గా నిర్ణయించారు.
గనులు/విభాగాల అధిపతులు అప్లికేషన్లను సరిగా పరిశీలించాలని నోటిఫికేషన్‌లో ఆదేశించారు. సర్వీసుకు సంబంధించిన వివరాలు, విద్యార్హత, అనుభవంలాంటి వివరాలను సరిగా చూడాలని చెప్పారు. అభ్యర్థుల అసెస్‌మెంట్ రిపోర్ట్‌ను అన్ని విభాగాల అధిపతులు సీల్డ్ కవర్‌లో అప్లికేషన్‌త జతచేసి పంపాలని తెలిపారు.
ఇంటర్నల్ అభ్యర్థులకు వయసు పరిమితి లేదని నోటిఫికేషన్‌లో తెలిపారు. చివరి తేదీ దాటిన తర్వాత అప్లికేషన్ వస్తే రిజెక్ట్ అవుతుందని వెల్లడించారు. ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సంబంధిత పత్రాలు జత చేసి వెంటనే సబ్మిట్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు తర్వాత రాత పరీక్షకు హాజరుకావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గనులు, అన్ని విభాగాల అధిపతులు విస్తృత ప్రచారం కల్పించాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు http://www.scclmines.com/internal వెబ్‌సైట్ సందర్శించాలి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


