తెలంగాణ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 3వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్-2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4వ తేదీ నిర్వహించనున్నారు. మిగతా పరీక్షలు మాత్రం పాత షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని స్పష్టం చేశారు.
మార్పు ఎందుకంటే...?

మార్చి 3వ తేదీన హోలీ పండుగ రానుంది. ఆ రోజు సెలవు దినం ఉండటంతో... ఎగ్జామ్ షెడ్యూల్ లో మార్పు చేశారు. మార్చి 3వ తేదీన కాకుండా... 4వ తేదీన నిర్వహించనున్నారు.మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:
- 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
- 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1