తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఎగ్జామ్స్.. పూర్తి వివరాలు!

తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జనవరి జనవరి 3 నుంచి జనవరి 20, 2026కు నిర్వహించనున్నారు.

Published on: Dec 16, 2025, 14:30:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ పరీక్షలను జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతాయని అధికారులు ప్రకటించారు. రెండు సెషన్లలో టెట్ పరీక్షలు ఉంటాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 1 పరీక్ష, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బొధించేవారికి పేపర్ 2 ఉంటుంది.

జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జనగాం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ అభ్యర్థులకు నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, నారాయణపేట అభ్యర్థులకు ఉంటుంది.

జనవరి 4న మొదటి సెషన్‌ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : మంచిర్యాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్‌ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, వరంగల్, జగిత్యాల వారికి ఉంటుంది.

జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, పెద్దపల్లి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్ : కరీంనగర్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగువారికి నిర్వహిస్తారు.

జనవరి 6న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 : నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, ఇతరాలు, నిజామాబాద్. రెండో సెషన్ : యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేట అభ్యర్థులకు ఉంటుంది.

జనవరి 8న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి. రెండో సెషన్ : హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి వారికి నిర్వహిస్తారు.

జనవరి 9న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : వికారాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్.

జనవరి 11 మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, జగిత్యాల అభ్యర్థులకు ఉండగా.. రెండో సెషన్ : మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జనగాం, నిర్మల్, జోగులాంబ గద్వాల్ అభ్యర్థులకు ఉంటుంది.

ఇక జనవరి 19వ తేదీన మెుదటి సెషన్‌లో పేపర్ 1(మైనర్) పరీక్ష.. అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ మీడియంలో వారికి ఉంటుంది. జనవరి 20వ తేదీన మెుదటి సెషన్ పేపర్ 2(మైనర్) పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More