దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఒక్కసారి చూసుకోండి!
పండుగల నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. దీంతో ప్రయాణికులు సౌకర్యంగా ఉండనుంది.
దీపావళి, ఛట్ పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే దసరా నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని రైళ్లను ప్రకటించడంతో ప్రయాణికులు రద్దీ లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

అక్టోబర్ 17వ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా తిరుపతి-సికింద్రాబాద్, అలాగే అక్టోబర్ 18న సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు(07497) ఉంటుంది. ఈ రూట్‌లోనే 17, 18వ తేదీల్లో విజయవాడ-సికింద్రాబాద్(07213), సికింద్రాబాద్-విజయవాడ(07214) స్పెషల్ రైలు ఉండనుంది.
నవంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్-భువనేశ్వర్(07165), నవంబర్ 5 నుంచి 26 వరకు భువనేశ్వర్-హైదరాబాద్(07166) స్పెషల్ రైళ్లు నడుస్తాయి.
అలాగే ధర్మవరం-సోలాపూర్(01438) మధ్య 18వ తేదీని ప్రత్యేక రైలు ఉంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సౌంత్రగాఛీకి 17, 18వ తేదీల్లో రైళ్లు ఉన్నాయి.
యశ్వంత్‌పూర్ నుంచి దర్బంగాకు స్పెషల్ రైళ్లు దక్షిణ మధ్య రైల్వై మీదుకా వెళ్తుంటాయి. దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఎందుకు అంటే కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు నడుస్తాయి. ప్రతీ సోమవారం దర్బంగా-యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది.
అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్-దర్బంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు వచ్చి.. వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రూట్‌లోని సమస్తిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్‌పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్‌లోనూ ఆగుతుంది. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. సర్వీసులను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చెప్పింది.
అక్టోబర్ 17న నాందేడ్-సీఎస్టీ ముంబై(07611), చర్లపల్లి-అనకాపల్లి(07097) ఉంటాయి. 18న సీఎస్టీ ముంబై-కరీంనగర్(01021), కరీంనగర్-సీఎస్టీ ముంబై(01022), అనకాపల్లి-చర్లపల్లి (07098) స్పెషల్ రైళ్లు నడవనున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


