ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్..!
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తిరుపతి, మచిలీపట్నం నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఈ వన్ వే స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి.
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మచిలీపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్ సిటీకి వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడవనున్నాయి.

మచిలీపట్నం - ఉమ్డానగర్ మధ్య ప్రత్యేక రైలు (07297 నెంబర్) ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది ఈనెల 18వ తేదీన రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్ కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్…. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా ఉమ్డానగర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
ఇక తిరుపతి - కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (07296 నెంబర్) అందుబాటులో ఉంటుంది.ఈ ట్రైన్ జనవరి 19వ తేదీన రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతిలో బయల్దేరి… మరునాడు ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
తిరుపతి - ప్రయాగరాజ్ మధ్య(ట్రైన్ నెంబర్ 07298 ) స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 20వ తేదీన తిరుపతి నుంచి ఉదయం 8.15 నిమిషాలకు బయల్దేరుతుంది. రెండో రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, గుత్తి, గుంతకల్, మంత్రాలయం, రాయచూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్ మీదుగా వెళ్తుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

