తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్.. ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును మెుదలుపెట్టింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు
నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ.
నవంబర్ 22న ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం.
నవంబర్ 23న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ.
డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ మెుదలయ్యే అవకాశం ఉంది. రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. తర్వాత ఎన్నికలు డిసెంబర్ రెండోవారం నిర్వహిస్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాలను ప్రజాపాలన వారోత్సవాల్లో వివరిస్తారు. క్షేత్రస్థాయిలో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. జూబ్లీహిల్స్ విజయంతో కేడర్ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో గ్రామస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి స్థానిక ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కావడం లేదు. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తు మీద జరగవు. అభ్యర్థులకు పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశం కోర్టుల్లో ఉన్నందున మెుదట గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు తర్వాత నిర్వహించాలనుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం కింద స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన నిధులు సుమారు రూ. 3,000 కోట్లు మార్చి, 2026 నాటికి ముగిసే అవకాశం ఉంది. అందుకే పంచాయతీ ఎన్నికలు ముందుగా నిర్వహించనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


