ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మేం నిర్ణయం తీసుకోవాలా? తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం కోర్టు బిగ్‌షాక్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు బిగ్‌షాక్ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌ను హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

జులై 31,2025న అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా కేటీఆర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుధిక్కారంపై నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని జస్టిస్ బీఆర్ గవాయి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ , ముకుల్ రోహత్గి కోర్టుకు చెప్పారు.
వచ్చే వారంలోగా నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ పొందలేడని మేం ఇప్పటికే చెప్పామని గుర్తు చేసింది.
'ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే స్పీకర్ కోర్టు ధిక్కారణకు సిద్ధం కావాలి. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేం ముందే చెప్పాం.. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి.' అంటూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా పిటిషన్ పై ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్.. నాలుగు వారాల్లో మ్యాటర్ వింటాం అంటూ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


