...
...
Next Story

స్వేచ్ఛ కేసులో మరో మలుపు.. పూర్ణ భార్య ఆరోపణలు

టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కేసులో అరెస్టయిన పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో సందేశం విడుదల చేశారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు.

Published on: Jun 30, 2025, 09:55:47 IST
By
Prefer HTon Google
Advertisement

టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ మరణం కేసు మరోమలుపు తిరిగింది. ఈకేసులో అరెస్టయిన పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో సందేశం విడుదల చేశారు. స్వేచ్ఛ కూతురు చేసిన నిందారోపణలు సరికావని, ఆ పాప వెనక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు.

వీడియో సందేశం సారాంశం ఇదీ

స్వేచ్ఛ వోటార్కర్
స్వేచ్ఛ వోటార్కర్

‘నేను పూర్ణచందర్ భార్య స్వప్నను. స్వేచ్ఛ నాకు పూర్ణచందర్ ద్వారానే పరిచయమైంది. ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు. వాళ్ల మధ్య రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. స్వేచ్ఛ ద్వారానే నాకు ఈ రిలేషన్ ఉందని తెలిసింది. ఆమె నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణను అడిగాను. ఏంటిది అని అడిగితే చెప్పాడు. అప్పుడు నాకు, ఆయనకు గొడవలు స్టార్ట్ అయినయి. నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయని తెలిసింది. ఇంక నేను ఆయనను వదిలేసిన. ఇప్పుడు నేను ఎందుకు మీడియా ముందుకు వచ్చానంటే స్వేచ్ఛ కూతురు మా ఆయనపై చేసిన ఆరోపణలు చూసి తట్టుకోలేక ముందుకొచ్చాను. ఆ నిందలు చూసి తట్టుకోలేకపోయి బయటకు వచ్చా. నా భర్త నా పిల్లలతో పాటే ఆ పాపను కూడా సరిసమానంగా చూసుకున్నాడు. స్కూలులో జాయిన్ చేశాడు. ఫీజులు కట్టాడు. నా పిల్లలకు బట్టలు తీసుకునేటప్పుడు ఆ పాపకు కూడా తీసుకునేవాడంట..’ అని పేర్కొన్నారు.

‘ఆ పాపను కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్లిపోతే పూర్ణ ఆ స్థానం తీసుకున్నడు. కన్న తండ్రి కంటే ఎక్కువగానే చూసుకున్నాడు. నా కూతురును ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలాగే చూసుకున్నాడు. అలా నిందలు వేయడం సరికాదమ్మా.?’ అని వేడుకుంది.

‘స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసేది’

నాకూ ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురును కూడా తన కూతురులాగే చూసుకున్నాడు. నా పిల్లలు చెప్పారు. అక్కడ ఒక ఆంటీ ఉంది. అక్క దగ్గరికి వెళ్లి ఆడుకుంటున్నామని చెప్పారు. తనను అమ్మా అని పిలువమని స్వేచ్ఛ అన్నదంట. నా కూతురు చెప్పింది. స్వేచ్ఛ కూతురు అలా ఎందుకు నిందలు వేస్తుందో నాకు తెలియదు. కానీ ఆమె వెనకుండి ఎవరు చెప్పిస్తున్నారో, ఎందుకు చెప్పిస్తున్నారో తెలియదు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అలాంటి చెడ్డ మనిషి కానే కాదు. నిన్ను, మీ అమ్మను చేరదేసిండు. ఇంత చేరదీసినా మీ మమ్మీ ఏం చేసింది? మమ్మల్ని రోడ్డుపాలు చేసేసింది. నా జీవితం ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి?

నాకు కోర్టు పైన నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. ఆయనను ఎలాగైనా కాపాడుకుంటా..’ అని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe