తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం టీశాట్ డిజిటల్ పాఠాలను అందించనుంది. ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచి ఈ పాఠాలు అందుబాటులోకి వస్తాయి.

శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 13వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి రోజుకు రెండు గంటల చొప్పున 42 రోజుల పాటు 84 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు టీశాట్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించిన పాఠ్యాంశాలు విద్య ఛానల్ ( https://www.youtube.com/@TSATNetwork ) లో ఉంటాయి. సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, రాత్రి తొమ్మిది నుండి 11 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయని టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పదవ తరగతి లేదా తత్సమానమైన పరీక్ష పాసైన విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించేందుకు టి-సాట్ పాఠ్యాంశ ప్రసారాలను వినియోగించుకోవాలని సూచించారు.
కొనసాగుతున్న దరఖాస్తులు:
అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు పాలిసెట్ పరీక్ష కోసం అప్లికేషన్ చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అయితే రూ. 250గా నిర్ణయించారు. గడువు దాటితే నిర్ణయించిన ఫీజుతో పాటు రూ. 100 ఫైన్ తో ఏప్రిల్ 21వ తేదీ వరకు, రూ. 300 తాత్కల్ ఫీజుతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రాసెస్ కోసం https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలి.
టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
{{/usCountry}}టీజీ పాలిసెట్ - 2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
{{/usCountry}}టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.