CCMB Recruitment 2026: హైదరాబాద్ సీసీఎంబీలో టెక్నీషియన్, డ్రైవర్ ఉద్యోగాలు - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
CSIR CCMB Recruitment 2026 :హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-సీసీఎంబీలోటెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు మే 26 ఆఖరి తేదీ. www.ccmb.res.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
CCMB Recruitment 2026 : హైదరాబాద్ లోని సీఎస్‌ఐఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR - CCMB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాలలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు మే 26, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

పోస్టు: టెక్నీషియన్
- ఖాళీల సంఖ్య: 23
- అర్హత : 55 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటు ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) / కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / ఫుడ్ ప్రొడక్షన్ ట్రేడ్‌లలో ఐటీఐ (ITI) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
- ప్రత్యామ్నాయ అర్హత : 55 శాతం మార్కులతో పదో తరగతి పాసై, పైన పేర్కొన్న ట్రేడ్‌లలో అప్రెంటిస్ ట్రైనీగా రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు: డ్రైవర్
- ఖాళీల సంఖ్య: 01
- అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మూడేళ్ల ఉద్యోగానుభవం, మోటార్ మెకానిజంపై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
- టెక్నీషియన్ పోస్టులకు గరిష్ట వయసు 28 ఏళ్లు మించకూడదు.
- డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయసు 27 ఏళ్లు లోపు ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
- యూఆర్ (UR), ఓబీసీ (ఎన్‌సీఎల్), ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు రూ. 500 ఫీజు ఉంటుంది.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
టెక్నీషియన్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులకు స్టేజ్-1లో 'ట్రేడ్ టెస్ట్' నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్-2లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
డ్రైవర్ పోస్టులకు మొదట స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. దీనికి 300 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు సీసీఎంబీ అధికారిక వెబ్‌సైట్ www.ccmb.res.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత, దానికి సంబంధించిన ప్రింట్ అవుట్ కాపీకి మీ అర్హత ధ్రువపత్రాలను జత చేసి హార్డ్ కాపీని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా : ది సెక్షన్ ఆఫీసర్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్), సీఎస్‌ఐఆర్ - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ - 500007.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.05.2026
- పోస్టు ద్వారా హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ: 05.06.2026
- అధికారిక వెబ్‌సైట్: www.ccmb.res.in
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చూడొచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

