Telangana ACB : ఏసీబీ వలలో డీఎస్పీ భీమ్ రెడ్డి - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు! కళ్లు చెదిరేలా ఆస్తులు

డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌తో పాటు 15 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా విల్లాలు, ఫ్లాట్లు, కిలోల కొద్దీ బంగారం లభ్యమయ్యాయి.

Published on: Jul 3, 2026, 09:25:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ (PCS) విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ….. అవినీతి మార్గాల ద్వారా ఆయన భారీగా స్థిర, చర ఆస్తులను కూడబెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి.

డీఎస్పీ భీమ్ రెడ్డి
డీఎస్పీ భీమ్ రెడ్డి

జూలై 2, 2026 న ఏసీబీ ప్రత్యేక బృందాలు గచ్చిబౌలిలోని డీఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన దాదాపు 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. మార్కెట్ విలువ ప్రకారం… వందల కోట్ల రూపాయలు పలికే భారీ ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోదాల్లో లభించిన స్థిరాస్తుల వివరాలు:

  • హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ వెస్సెల్లా మీడోస్‌లో ఒక విల్లా
  • టెలికాం నగర్‌లో ఒక జీ+2 అంతస్తుల ఇల్లు (పెంటహౌస్‌తో కలిపి) మరియు ఒక ఫ్లాట్
  • గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్
  • మణికొండ లంకోహిల్స్ రోడ్డులోని ఒక జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో 500 చదరపు గజాల వాటా
  • మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వాణిజ్య సముదాయం
  • తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు
  • ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్
  • సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి
  • కర్ణాటక రాష్ట్ర పరిధిలో వేర్వేరు చోట్ల 6 ఎకరాలు మరియు 38 ఎకరాల భారీ వ్యవసాయ భూములు
  • బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి
  • నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్
  • పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ పరిధిలో 400 మరియు 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లు
  • వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 1000 చదరపు గజాల భూమితో పాటు మరో 2 ఎకరాల వ్యవసాయ భూమి
  • ముచ్చింతల్ గ్రామం (సీసీ కుంట) వద్ద 4 ఎకరాల 20 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్
  • 'మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్' సంస్థలో రూ. 75 లక్షల భారీ పెట్టుబడి పత్రాలు.

స్థిరాస్తులతో పాటు డీఎస్పీ భీమ్ రెడ్డి ఇల్లు… ఆయన బినామీ ఇళ్లలో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం కూడా బయటపడ్డాయి. డీఎస్పీ ఇంట్లో రూ. 3.60 లక్షల నగదు, ఆయన బినామీ ఇంట్లో మరో రూ. 40 లక్షల లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. అలాగే సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివిధ బ్యాంకు ఖాతాలలో దాదాపు రూ. 19 లక్షల 91 వేల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రభుత్వ డాక్యుమెంట్ విలువే భారీగా ఉందని.... వీటి బహిరంగ మార్కెట్ విలువ అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఏసీబీ విభాగానికి చెందిన సిటీ రేంజ్-2 అధికారులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More