తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపు న్యూస్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
వాహనాలపై ట్రాఫిక్ చలాన్ల తగ్గింపు మీద ఇటీవల ఓ వార్త ఎక్కువగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి మంచి ఛాన్స్ వచ్చిందంటూ ఇటీవల ఓ వార్త బాగా వైరల్ అయింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఉపశమనం కలిగించేలా డిసెంబర్ రెండో వారంలో అవకాశం వచ్చిందని చాలా వార్తలు వచ్చాయి. దేశవ్యాప్త లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లపై 50 శాతం నుండి 100 శాతం వరకు తగ్గింపును అందుకోవచ్చని ఫేక్ న్యూస్ వచ్చింది.

ఆ ఫేక్ న్యూస్‌లో డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు, పెనాల్టీలు సెటిల్ చేసుకోవచ్చని తెలిపారు. భారీగా తగ్గింపును పొందవచ్చన్నారు. తెలంగాణతోపాటుగా మరికొన్ని రాష్ట్రాలు రాయితీ ట్రాఫిక్ చలాన్‌లను అందించడంలో పాల్గొంటున్నాయని వార్త బాగా సర్క్యూలేట్ అయింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ లిస్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, రెడ్ సిగ్నల్స్ జంప్, అతివేగం, తప్పు పార్కింగ్, గడువు ముగిసిన పీయూసీ, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్లు లేకపోవడం లేదా అసంపూర్ణ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, తప్పుగా జారీ చేసిన చలాన్లు, పెండింగ్‌లో ఉన్న పాత ఈ-చలాన్లను లోక్ అదాలత్ సందర్భంగా సెటిల్ చేసుకోవచ్చని తప్పుడు సమాచారం వ్యాప్తి జరిగింది. తాజాగా దీనిపై తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల మాఫీపై రాచకొండ పోలీసులు స్పందించారు. 100 శాతం ట్రాఫిక్ చలాన్ల మాఫీ వార్తలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకూడదని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ల మాఫీపై లోక్ అదాలత్, పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


