తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు, ముఖ్య తేదీలివే
తెలంగాణ డీసీసీబీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కోఆపరేటివ్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7 ఖాళీలున్నాయి. ఈనెల 23వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో (DCCBs) కో-ఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7 ఖాళీలున్నాయి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆదిలాబాద్ డీసీసీబీలో ఒక పోస్టును, ఖమ్మం డీసీసీబీ -1 పోస్టు, కరీంనగర్ డీసీసీబీ -1, మహబూబ్ నగర్ - 01, నల్గొండ- 01, నిజామాబాద్ డీసీసీబీ 01, వరంగల్ డీసీసీబీలో ఒక పోస్టును రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్
- ఉద్యోగాలు -కో-ఆపరేటివ్ ఇంటర్న్స్
- మొత్తం ఖాళీలు - 7
- అర్హతలు - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కో-ఆపరేటివ్ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాలలో ఏదో ఒకదానిలో ఉత్తీర్ణులై ఉండాలి. రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ లేదా రెండేండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- కంప్యూటర్ అప్లికేషన్స్‌పై ప్రావీణ్యం ఉండాలి. తెలుగు భాషపై పట్టు (మాట్లాడటం, చదవడం, రాయడం) తప్పనిసరి.
- అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - https://tgcab.bank.in/notifications వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ సెట్ ను జతచేసి ఆఫ్లైన్ విధానంలో పంపించాలి.
- దరఖాస్తులకు చివరితేదీ - 23 డిసెంబర్ 2025
- పంపాల్సిన చిరునామా - "ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్ – 500001.
- అధికారిక వెబ్ సైట్ - https://tgcab.bank.in/notifications
- హెల్ప్ డెస్క్ నెంబర్ - 040-24685536/559
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

