రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్ 2026) నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

టీచర్ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు ఈ కోర్సులు చేసుకోవచ్చు. ఈ కోర్సులు చదివేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలో…. క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా…. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఈఈఈసెట్ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఎస్ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
మేలో డీఈఈఈసెట్ పరీక్షలు:
టీజీ డీఈఈఈసెట్ 2026 ప్రవేశ పరీక్షలు మే 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. మొత్తం వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
ఈ నోటిఫికేషన్ తో పాటు ఇతర సందేహాలు ఏమైనా ఉంటే 8317567404 నెంబర్ ను సంప్రదించవచ్చు. లేదా tgdeecet26@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
దరఖాస్తు విధానం…
- అభ్యర్థులు ముందుగా https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని అప్లికేషన్ ఫీజు లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత ఫిల్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాలి.
- చివరగా సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.