డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన పత్రాలను భద్రపరిచే RTA m-Wallet యాప్‌ను రవాణా శాఖ, యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుండి తొలగించింది. రవాణా శాఖ అధికారుల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం తన సిస్టమ్‌లను 'Sarathi', 'Vahan' ప్లాట్‌ఫారమ్‌లతో అనుసంధానించే(integrate) ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 'Sarathi' పోర్టల్ లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, ఉన్న లైసెన్సుల పునరుద్ధరణ లేదా నకలు ప్రతిల జారీ, వ్యక్తిగత సమాచార అప్డేట్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కాగా 'Vahan' పోర్టల్ వాహన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ ధృవీకరణ, పన్నులు, అనుమతులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

RTA m-Wallet గురించి తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా శాఖకు సంబంధించిన డేటా Vahan, Sarathi పోర్టల్‌లతో అనుసంధానిస్తున్నారు. ఈ ప్రక్రియలో DigiLocker కూడా ఒక భాగంగా ఉంటుంది. దీనిలో డ్రైవింగ్ లైసెన్సుల వంటి పత్రాలను భద్రపరచుకోవచ్చు.
ఇటీవలే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాహన్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీనితో రాష్ట్రం జాతీయ వాహన డేటాబేస్‌తో అనుసంధానమైంది. సమర్థవంతమైన డేటా నిర్వహణకు, ప్రభుత్వ పాలనకు అత్యంత ఆవశ్యకమైన ఆధునిక సాంకేతికతను స్వీకరించడానికి ఈ చర్య నాంది పలికిందని పొన్నం గతంలో అన్నారు.
ఇదిలా ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ మొత్తం రూ.7,097.38 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గురువారం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి. ఈ కాలానికి గాను రూ.8,535 కోట్ల మొత్తం ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా 83.16 శాతం అంటే రూ.7,097.38 కోట్లను సాధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆదాయంలో ఎక్కువ భాగం జీవితకాల పన్ను(Life Time Tax) వసూళ్ల ద్వారా లభించింది. ఇది రూ.4,714.63 కోట్లుగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో త్రైమాసిక పన్ను రూ.961.02 కోట్లు, వివిధ రుసుములు, సేవా ఛార్జీలు రూ.820.09 కోట్లుగా ఉన్నాయి. చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు, తనిఖీల వంటి అమలు కార్యకలాపాల ద్వారా రూ.212.49 కోట్లు, గ్రీన్ టాక్స్ వసూళ్ల ద్వారా రూ.78.35 కోట్లు ఆదాయం సమకూరింది.
అంతేకాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 91,637 విద్యుత్ వాహనాలు(Electric Vehicles) రిజిస్టర్ అయినట్లు కూడా రవాణా శాఖ పేర్కొంది. లైఫ్ ట్యాక్స్ మినహాయింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఈ మినహాయింపుల విలువ రూ.769.81 కోట్లకు చేరింది.
{{/usCountry}}అంతేకాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 91,637 విద్యుత్ వాహనాలు(Electric Vehicles) రిజిస్టర్ అయినట్లు కూడా రవాణా శాఖ పేర్కొంది. లైఫ్ ట్యాక్స్ మినహాయింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఈ మినహాయింపుల విలువ రూ.769.81 కోట్లకు చేరింది.
{{/usCountry}}