తెలంగాణ జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాసెస్ సర్వర్ పోస్టులను రిక్రూట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అత్యధికంగా 319 ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
జిల్లా కోర్టు ఉద్యోగాలు - దరఖాస్తు విధానం ఇలా…
- అభ్యర్థులు ముందుగా https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని రిక్రూట్ మెంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ ఫర్ ఆన్ లైన్ అప్లికేషన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ తొమ్మిది రకాల పోస్టులు కనిపిస్తాయి. ఇక్కడ ఉంటే న్యూ రిజిస్ట్రేషన్ (OTPR) పక్కన ఉండే లింక్ పై క్లిక్ చేయాలి.
- ముందుగా మీ ప్రాథమిక వివరాలతో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాలి.
- నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఓసీ / బీసీ అభ్యర్థులు: రూ.600, ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మాజీ సైనికులు / దివ్యాంగులు (PWD): రూ.400 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- ఫొటో, సంతకంతో పాటు సంబంధిత విద్యా అర్హత పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మీ రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
విద్యా అర్హతలు, వయోపరిమితులు, ఇతర వివరాలను https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకు చూడొచ్చు. ఖాళీల వారీగా పోస్టుల వివరాలను చూస్తే ఈ కింద విధంగా ఉన్నాయి….
- ఆఫీస్ సబార్డినేట్: 319
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
- జూనియర్ అసిస్టెంట్: 159
- టైపిస్ట్: 42
- ఫీల్డ్ అసిస్టెంట్: 61
- ఎగ్జామినర్: 49
- కాపిస్ట్: 63
- రికార్డ్ అసిస్టెంట్: 36
- ప్రాసెస్ సర్వర్: 95
విద్యా అర్హతలు, వయోపరిమితులు, ఇతర వివరాలను https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకు చూడొచ్చు. ఖాళీల వారీగా పోస్టుల వివరాలను చూస్తే ఈ కింద విధంగా ఉన్నాయి….
- ఆఫీస్ సబార్డినేట్: 319
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
- జూనియర్ అసిస్టెంట్: 159
- టైపిస్ట్: 42
- ఫీల్డ్ అసిస్టెంట్: 61
- ఎగ్జామినర్: 49
- కాపిస్ట్: 63
- రికార్డ్ అసిస్టెంట్: 36
- ప్రాసెస్ సర్వర్: 95