గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల సరఫరా నెట్‌వర్క్‌పై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. 'ఈగిల్ (EAGLE) ఫోర్స్', హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పంజాగుట్ట కేసుతో వెలుగులోకి….

ఈ ఏడాది మే నెలలో పంజాగుట్ట పోలీసులు కేషవ్ రాజ్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను నగరంలో ముగ్గురు వ్యక్తులకు విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి కారు డాష్‌బోర్డ్ పరిశీలించగా 13 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 7 గ్రాముల చరస్ లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు అతడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసు విచారణలో కేషవ్ రాజ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారంలో తాను గోవా వెళ్లి క్రిస్టీ నుంచి రూ. 40,000 విలువైన ఎండీఎంఏ, చరస్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వాటిని హైదరాబాద్‌లో రూ. 80,000కు విక్రయించి రెట్టింపు లాభం పొందాలని పథకం వేసినట్లు అంగీకరించాడు.
కేషవ్ సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. కీలక విషయాలను సేకరించారు. క్రిస్టీకి చెందిన బ్యాంకు ఖాతాల ఆర్థిక విశ్లేషణ నిర్వహించగా….. సుమారు రూ. 48.4 లక్షల జమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. క్రిస్టీకి చెందిన అనుచరులు నేరుగా గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, ఇక్కడి వినియోగదారులకు డ్రగ్స్ డెలివరీ చేసేవారు. ఆపై నగదు వసూలు చేసి క్రిస్టీకి చెందిన ఖాతాల్లో డిపాజిట్ చేసేవారని విచారణలో తేలింది. ఈ లావాదేవీల మూలాలు, లబ్ధిదారులు, వారి మధ్య ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అరెస్ట్ అయిన క్రిస్టీ మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన అధికారులకు పలు కీలక ఆధారాలు లభించాయి. తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తులు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా క్రిస్టీ నెట్‌వర్క్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్లు, కాంటాక్ట్ వివరాలు లభించాయి. ఈ డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కొనుగోలుదారులు, పెడ్లర్లు, ఆర్థిక మధ్యవర్తులను గుర్తించి పట్టుకునేందుకు విచారణను మరింత వేగవంతం చేసినట్లు ఈగిల్ ఫోర్స్ వెల్లడించింది.
{{/usCountry}}అరెస్ట్ అయిన క్రిస్టీ మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన అధికారులకు పలు కీలక ఆధారాలు లభించాయి. తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తులు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా క్రిస్టీ నెట్‌వర్క్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్లు, కాంటాక్ట్ వివరాలు లభించాయి. ఈ డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కొనుగోలుదారులు, పెడ్లర్లు, ఆర్థిక మధ్యవర్తులను గుర్తించి పట్టుకునేందుకు విచారణను మరింత వేగవంతం చేసినట్లు ఈగిల్ ఫోర్స్ వెల్లడించింది.
{{/usCountry}}