...
...
Next Story

Singareni Diwali Bonus 2025 : సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. రూ. 400 కోట్ల బోనస్

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం రూ. 400 కోట్ల బోనస్‌ను 39,500 మంది కార్మికులకు అందించనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 18వ తేదీన కార్మికుల ఖాతాల్లో డబ్బులను జమ కానున్నాయి.

Published on: Oct 17, 2025, 18:50:27 IST
Advertisement

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. బోనస్ కింద రూ.400 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి కార్మికుని ఖాతాలో శనివారం రూ. 1.03 లక్షలు జమ అవుతాయని వెల్లడించారు. బోనస్ ప్రకటించడంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. రూ. 400 కోట్ల బోనస్
సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. రూ. 400 కోట్ల బోనస్

మొత్తం 39,500 మంది కార్మికులు లబ్ధిదారులు ఉన్నారని సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఒక్కో కార్మికుడికి బోనస్ కింద రూ. 1.03 లక్షలు జమవుతాయని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన (శ‌నివారం) చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల చేసింది.

బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బోనస్ లభించడం ఇదే మొదటిసారి అని గణాంకాలు సూచిస్తున్నాయి. 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో 21 వేలుగా ఉన్నటువంటి బోనస్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈసారి ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటింది. దేశంలో పని చేస్తున్న ఇతర కార్మికులకు ఈపిఎల్ఆర్ బోనస్ సెప్టెంబర్ లోనే అందగా…. సింగరేణిలో పనిచేసే కార్మికులకు మాత్రం ఇప్పుడు అందుతుంది.

ఇక ఇటీవలనే దసరా పండుగను పురస్కరించుని కూడా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం పంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 జమచేసింది. మొత్తం 71 వేల మందికి లబ్ధి చేకూరింది. బోనస్ ప్రకటనపై సింగరేణి కార్మికులతో పాటు వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks