TG Smart Ration Cards : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కొత్త అప్డేట్ - త్వరలోనే మీ చేతికి..!
Telangana Smart Ration Cards : త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా… అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. ఆ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది.
Telangana Smart Ration Cards : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించనుంద. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం ఏకకాలంలో జరుగుతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా తేదీలను ప్రకటించాల్సి ఉంది.
ఇక స్మార్ట్ గా రేషన్ కార్డు…
అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ సరకులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టనుంది. రాప్రస్తుతం లబ్ధిదారులు ఏ4 (A4) సైజ్ కాగితం రూపంలో ఉన్న రేషన్ కార్డులనే వాడుతున్నారు. చిరిగిపోయే అవకాశం ఉన్న ఈ పాత పేపర్ కార్డుల స్థానంలో…. ఇప్పుడు ఆధునిక హంగులతో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం అందించనుంది.
ఈ కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనేది తెలిసిపోతుంది. కార్డులో ఉన్నవారికి ఇప్పటివరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువులు ఏయే నెలల్లో ఎంతెంత పంపిణీ అయ్యాయనే పూర్తి హిస్టరీ కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. కార్డుదారుడు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి… కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ (వేలిముద్ర) వేసి సులభంగా రేషన్ తీసుకోవచ్చు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేపర్ రూపం నుంచి ప్లాస్టిక్ కార్డు రూపంలోకి రేషన్ కార్డులు రావడం ఇదే తొలిసారి. వీటిని మన చేతిలో ఉండే క్రెడిట్, డెబిట్ కార్డుల సైజులో ఎంతో రూపొందించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై లబ్ధిదారుడి (యజమాని) ఫోటోతో పాటు పేరు, చిరునామా స్పష్టంగా ముద్రించి ఉంటుంది.
ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే పూర్తి ఖర్చును పౌరసరఫరాల శాఖే భరిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నారు. కొత్త కార్డుల కోసం ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 3,39,96,239 గా ఉంది. ఈ భారీ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పంపిణీ పండుగ షురూ కానుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

